-ఒక్కరోజు ముందుగా పెన్షన్ల పంపిణీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
-62.76 లక్షల పింఛనుదారులకు రూ. 2725.79 కోట్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం
-కొత్తగా 8,977 మంది లబ్ధిదారులకు రూ. 3.59 కోట్లు విడుదల
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
24 ఫిబ్రవరి 2026: 1 మార్చి 2026 ఆదివారం అయినందున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు ఒక రోజు ముందుగా అనగా 28 ఫిబ్రవరి 2026వ తేదీన కొత్తగా మంజురైన 8,977 వితంతు(స్పౌస్) పెన్షన్ లతో కలిపి మొత్తం 62,76,322 మంది పింఛనుదారులకు రూ. 2725.79 కోట్లు స్వర్ణ గ్రామం/ స్వర్ణ వార్డు సిబ్బంది పింఛనుదారుల ఇంటివద్దనే అందజేయడం జరుగుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరీల క్రింద్ర మొత్తం 62,76,322 మంది పింఛనుదారులకు రూ .2725.79 కోట్లు స్వర్ణ గ్రామ/ స్వర్ణ వార్డ్ సిబ్బంది పంపిణిచేస్తారని అన్నారు.28 ఫిబ్రవరి 2026 తేదిన పంపిణీ చేయగా మిగిలిన పెన్షన్ లను 2 మార్చి 2026న సచివాలయ సిబ్బంది పింఛనుదారుల ఇంటివద్దనే పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు పింఛన్ల మొత్తంగా రూ. 57,808.68 కోట్లు ఖర్చు చేయటం జరిగిందని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సామాజిక భద్రత పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనమని మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ ఈ ప్రకటనలో తెలియజేశారు.
Prajavartha Online Telugu News