Breaking News

ధర్మవరం మెగా క్లస్టర్ తో 22 వేల మంది మహిళలకు ఉపాధి

-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ధర్మరంలో రూ.38.03 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ క్లస్టర్ ఏర్పాటుతో 22 వేల మంది మహిళలకు లబ్ది కలగనుందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. అనంతపురం నియోజక వర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి, స్థానిక మహిళలకు ఉపాధి కల్పను కృషి చేస్తామని వెల్లడించారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు సందర్భంగా బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సవిత పైవిధంగా స్పందించారు. ధర్మరంలో రూ.38.03 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ మెగా క్లస్టర్ ఏర్పాటుతో స్వల్పకాలంలో ఏడు వేల మందికి, దీర్ఘ కాలంలో 15 వేల మందికి..ఇలా 22 వేల మంది మహిళలకు ఉపాధి కలుగనుందన్నారు. ధర్మవరం మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ తో శ్రీసత్యసాయి, అనంతపురం మహిళలకు ఎంతో లబ్ధి కలుగనుందన్నారు. ఇటీవల నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అందించనున్నామని, దీనిలో భాగంతో అనంతపురంలో సర్వే నిర్వహించామని తెలిపారు. ఈ సర్వేలో స్వల్ప సంఖ్యలో చేనేతలు ఉన్నట్లు గుర్తించామన్నారు. రాయలసీమను పారిశ్రామిక హబ్ గా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. దీనిలో భాగంగా అనంతపురం నియోజక వర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి, ఆ నియోజక వర్గ మహిళలకు అండగా నిలుస్తామని మంత్రి సవిత తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *