Breaking News

జగన్ ఐదేళ్ల పాలనలో క్రీడలకు, క్రీడాకారులకు చేసింది ఏమి లేదు… : శాప్ చైర్మన్ రవి నాయుడు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శాప్ ప్రధాన కార్యాలయంలో శాప్ చైర్మన్ రవి నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ శాసన సభ–శాసన మండలి రెండో విడత స్పోర్ట్స్ పోటీలు అత్యంత ఘనంగా, విజయవంతంగా ముగిశాయని ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడాకారులు, మీడియా సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిందన్నారు. క్రీడా రంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా పాత్ర కీలకమని అన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వయంగా పిలిచి, ఎన్టీఆర్ హయాంలో జరిగిన క్రీడా పోటీల తరహాలో మళ్లీ శాసన సభ్యుల స్థాయిలో క్రీడా సంస్కృతిని తీసుకురావాలని సూచించారని రవి నాయుడు తెలిపారు. ఆ సూచనల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులను పక్కనబెట్టి పోటీల్లో పాల్గొనడం ప్రజల్లో క్రీడల పట్ల కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. గాయాలైనప్పటికీ ఎవరూ వెనక్కి తగ్గకపోవడం, పోరాట స్పూర్తితో ఆడటం ఎంతోమంది యువతకు, తల్లిదండ్రులకు ప్రేరణగా నిలిచిందన్నారు.శాప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్న ప్రతి ప్రజాప్రతినిధికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
కూటమి ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఈ పోటీల్లో మొత్తం 12 విభాగాల్లో గేమ్స్ నిర్వహించామని, ప్రతి విభాగంలో విజేతలు, రన్నర్స్‌ను పూర్తిస్థాయి పారదర్శకతతో ఎంపిక చేశామని తెలిపారు. శాప్ చరిత్రలోనే కాకుండా, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఇంత పెద్ద స్థాయిలో క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం ఇదే తొలిసారన్నారు. క్రీడల విషయంలో వైసీపీ వైఖరిపై రవి నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో క్రీడలకు ప్రాధాన్యత లేకుండా పోయిందని, బ్యాట్ పట్టుకుని ఫోటోలు దిగడం తప్ప క్రీడాకారులకు చేసింది ఏమీలేదన్నారు. యార్రాజి జ్యోతి వంటి జాతీయ స్థాయి క్రీడాకారిణికీ కనీస గౌరవం దక్కలేదని ఆరోపించారు. గుంటూరులోనే మల్టీపర్పస్ ఇండోర్ హాల్ నిర్మాణం మరియు ప్రో కబడ్డీ టోర్నమెంట్లు నిర్వహించే స్థాయికి మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నామని, మార్చి 6వ తేదీన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి  కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యా మరియు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో శాప్ బోర్డు సభ్యులు సంతోష్ కుమార్, జగదీశ్వరి, రజనీ మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *