-పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక భవానీపురంలోని హజరత్ సయ్యద్ గాలిబ్ షహీద్ దర్గా నందు ఆదివారం ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని వైసిపి మైనారిటీ నాయకులు అబ్దుల్ రెహమాన్, మొహమ్మద్ ఇషాక్, మొహమ్మద్ నసీం ల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు మరియు విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. ముందుగా ఆయన దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఐకమత్యంతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ మొహమ్మద్ ఇర్ఫాన్, షేక్ హయత్ మరియు తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News