గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ లో అందే ఆర్జీలను త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం కౌన్సిల్ సమావేశం ఉన్నందున కమిషనర్ ఆదేశాల మేరకు మేనేజర్, డిఈఈలు, ఏసిపీలు పిజిఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అర్జీలను తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిజిఆర్ఎస్ ప్రజలు ఇస్తున్న అర్జీల పరిష్కారంకు విభాగాధిపతులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి అర్జీని నిర్దేశిత గడువు మేరకు పరిష్కారం చేయాలని, జీరో బియాండ్ ఎస్ఎల్ఏ నిర్వహించాలన్నారు. అర్జీలు రీ ఓపెన్ అయితే విభాగాధిపతులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పిజిఆర్ఎస్ ద్వారా 37 అర్జీలు అందాయని, వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 7, ఇంజినీరింగ్ విభాగం 17, రెవెన్యూ విభాగం 10, ప్రజారోగ్య విభాగం 2, ఉపా సెల్ విభాగానికి సంబందించి 1 ఫిర్యాదు అందాయన్నారు. కార్యక్రమంలో మేనేజర్ బాలాజీ బాష, ఏసిపీ రెహ్మాన్, డిఈఈ రమేష్ బాబు విభాగ సూపరిండెంట్ లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News