గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు మార్చి 18వ తేది గుంటూరు పట్టణ పర్యటన ప్రతిపాదన ఉందని, సదరు పర్యటన మార్గాలను సోమవారం నగరపాలక సంస్థ అధికారులతో కలిసి జిఎంసి నుండి చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. ఇన్నర్ రింగ్ శ్రీ కన్వెన్షన్, జెకెసి రోడ్, పట్టాభిపురం మెయిన్ రోడ్, కలెక్టరేట్ రోడ్, మార్కెట్, బస్టాండ్, పొన్నూరు రోడ్ లను పరిశీలించారు. ఆయా ప్రాంతాలో రోడ్లపైన ఆక్రమణలు తొలగింపు, రోడ్ల పై గోతులు సరి చేయడం, ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంకు డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతులకు పర్యటన మార్గాల్లో పర్యవేక్షణ విధులు కేటాయించాలని అదనపు కమిషనర్ చల్లా ఓబులేసుని ఆదేశించారు.
Prajavartha Online Telugu News