Breaking News

ఈ నెలాఖరులోపు ఏక మొత్తంగా చెల్లిస్తే వడ్డీలో 50 శాతం రాయితీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆస్తి, ఖాళీ స్థల పన్నుల బకాయిలు ఈ నెలాఖరులోపు ఏక మొత్తంగా చెల్లిస్తే వడ్డీలో 50 శాతం రాయితీని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం.58 (తేదీ:16-03-2026) జారీ చేసిందని, గుంటూరు నగరంలోని పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పన్ను చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్నుబకాయిలను ఈ నెలాఖరులోపు ఆస్తి పన్ను ఏక మొత్తంగా చెల్లిస్తే వారికి వడ్డీ 50 శాతం రాయితీని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ సదుపాయం ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటికే వడ్డీతో కలిపి పూర్తిగా పన్ను చెల్లించిన వారికి, సదరు వడ్డీలో 50 శాతం రాబోవు సంవత్సరానికి పన్నులకు జమ కాబడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఆస్తి పన్ను మొత్తంలో సగం చెల్లించి మిగిలిన బకాయిలున్న వారు కూడ ఈ నెలాఖరులోపు ఏక మొత్తంలో చెల్లిస్తే వారికి కూడా వడ్డీ రాయితీ వర్తిస్తుందన్నారు. కావున ప్రభుత్వం కల్పించిన ఈ సదావకాశాన్ని నగర పరిధిలోని పన్ను బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అడ్మిన్ కార్యదర్శులు డోర్ టు డోర్ వెళ్లి వడ్డీ రాయితీతో కూడిన స్లిప్స్, హౌస్ సర్వీస్ కనెక్షన్ వివరాలతో నీటి చార్జీల స్లిప్స్ ని 2 రోజుల్లో నూరు శాతం అందించాలని ఆదేశించారు. బుధవారం నుండి ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్లు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పని చేస్తాయన్నారు. ఈ నెలలో ఉగాది, రంజాన్ వంటి పండుగ, సెలవు రోజుల్లోనూ జిఎంసి మెయిన్, సర్కిల్ కార్యాలయాల్లో కౌంటర్లు పని చేస్తాయని, అవసరమైతే అదనపు కౌంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *