Breaking News

ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ విజయవంతం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగంలో నిర్వహించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ విజయవంతంగా నిర్వహించేందుకు సహకారం అందించిన రాష్ట్ర జిల్లా యంత్రాంగానికి హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. మంగళవారం జిల్లా సైనిక్ వెల్ఫేర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మహిళ, పురుష యువత  యువత కోసం మార్చి 9 నుంచి  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా ర్యాలీకి యువత హాజరైన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన బాలురు ఒకేరోజు ఏడువేలకు పైగా హాజరైన అన్ని పరీక్షలు సకాలంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు.  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ కోసం 2025 ఆగస్టు నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో యువతకు వాయుసేన ఉపాధి అవకాశాలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి రెండు నెలల నుంచి ర్యాలీకి ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. ర్యాలీ విజయవంతంగా జరగడానికి పూర్తి సహకారం అందించిన గతంలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అదేవిధంగా అన్ని ఏర్పాట్లు సమకూర్చిన జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలికి లైజనింగ్ ఆఫీసర్ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. పటిష్ట పోలీస్ బందోబస్తు కల్పించిన జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్, అడిషనల్ ఎస్పీ, మంగళగిరి డిఎస్పి కి, మంగళగిరి సీఐ ఇతర సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ర్యాలీ నిర్వహించుకోవడానికి ప్రాంగణం అందించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ తో పాటు క్రీడా ప్రాంగణం, స్టేడియాలు వినియోగించుకోవడానికి సహకరించిన యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ పాల్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రాంగణంలో నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణ చేపట్టిన ఎంటీఎంసీ అధికారులకు, విద్యుత్తు, అగ్నిమాపక, ఎన్ఐసీ, వైద్యారోగ్య శాఖ , పత్రికల్లో కవరేజ్ అందించిన మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు.  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల యువత బ్లూ యూనిఫాం ధరించటానికి అవకాశం కల్పించటం సంతోషంగా, సంతృప్తి గా ఉందన్నారు.

సమావేశంలో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల, 12 ఎయిర్‌మెన్ సెలెక్షన్ సెంటర్, సికింద్రాబాద్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *