విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వ ఆదేశముల మేరకు ఫిబ్రవరి 2027 లో జరగబోవు జనభాగణన నిమిత్తం ముందస్తుగా ఇండ్ల గణన మరియు ఇండ్ల జాబితా తయారీ చేపట్టవలసియున్నది. సదరు ఇండ్ల గణన పౌరులు మరియు గృహస్తులు స్వయంగా కేంద్ర ప్రభుత్వ వెబ్ పోర్టల్ ద్వారా ది.15.04.2026 నుండి 30.04.2026 వరకు వారి వారి గృహ సంబంధిత వివరములను స్వీయ నమోదు చేసుకొనవచ్చును. తదుపరి ది.01.05.2026 నుండి 30.05.2026 వరకు సంబంధించిన ప్రాంతములలో నియమించబడిన ఎన్యుమరేటర్ లు ప్రతి ఇంటిని సందర్శించి గణన గృహముల జాబితా మరియు సదరు గృహములందు నివసించుచున్న సభ్యుల సంఖ్య తయారుచేయవలసియున్నది. ఈ ప్రక్రియలో భాగంగా ఈ రోజు అనగా ది. 18.03.2026 న నగరపాలక సంస్థ కార్యాలయము నందు గృహగణన బ్లాక్ లు తయారుచేయుట పై సిబ్బంది కి అవగాహన, శిక్షణ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమం లో అదనపు కమీషనర్ (జనరల్) విజయవాడ నగరపాలక సంస్థ మరియు డైరెక్టరేట్ అఫ్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధిగా సి.హెచ్ వెంకటరమణ, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News