గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తుళ్ళూరు వన్ స్టాప్ సెంటర్ లో లీగల్ పర్సనల్/ లాయర్ కాంట్రాక్టు పద్ధతిపై పని చేయుటకు మహిళా అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత అధికారి ప్రసూన తెలియు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మిషన్ శక్తి స్కీమ్ క్రింద పనిచేస్తున్న వన్ స్టాప్ సెంటర్ నడపడం జరుగుతుందన్నారు. దరఖాస్తులను ఈ నెల 21వ తేదీ నుండి 26వ తేదీ వరకు కార్యాలయ పని వేళలలో స్వీకరించడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు గుంటూరు జిల్లా అధికారిక వెబ్ సైట్ (https://guntur.ap.gov.in/notice_category/recruitment/) లో కానీ, కలెక్టర్ బంగళా రోడ్ లో గల జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయంలో గాని సంప్రదించవచ్చని వివరించారు.
Tags guntur
Check Also
36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు
-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …
Prajavartha Online Telugu News