Breaking News

దొమ్మేటి వెంకటరెడ్డి.. సామాజిక చైత‌న్య జ్యోతి

– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాజిక చైత‌న్య జ్యోతి, శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డిగారు బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తికి విశేష కృషిచేశార‌ని, ఆయ‌న అందించిన స్ఫూర్తి చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. శెట్టిబలిజ సమాజానికి విద్య‌, ఐక్య‌త‌, గౌర‌వాన్ని క‌ల్పించిన సామాజిక సంస్క‌ర్త దొమ్మేటి వెంక‌ట‌రెడ్డి జ‌యంతి సంద‌ర్భంగా క‌లెక్ట‌రేట్‌లో సోమ‌వారం జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ పాల్గొన్నారు. అధికారుల‌తో క‌లిసి దొమ్మేటి వెంక‌ట‌రెడ్డి చిత్ర‌ప‌టానికి పూల మాల‌లు వేసి ఘ‌న నివాళులు అర్పించారు. మహనీయులు దొమ్మేటి వెంకటరెడ్డి చేసిన సామాజిక సేవల‌ను ఈ సంద‌ర్భంగా స్మ‌రించుకున్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ లక్ష్మీశ మాట్లాడుతూ సామాజిక సేవతో దొమ్మేటి వెంక‌ట‌రెడ్డిగారు స‌మాజంలో త‌న‌దైన ప్ర‌త్యేక ముద్ర వేశార‌న్నారు. కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇలక్కియ‌, డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, వివిధ శాఖ‌ల అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *