మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే ఖరీఫ్ పంట కాలంలో రైతులకు యూరియా పంపిణీలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ తో కలసి వ్యవసాయ శాఖ అనుబంధ అధికారులు తో యూరియా సరఫరా ఏర్పాట్లపై సన్నద్ధత సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా అయ్యే విధంగా ముందస్తుగానే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. జిల్లాకు సరిపడినంత యూరియాను సకాలంలో తెప్పించుకునే ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో వరి, ఉద్యాన పంటలు 1.80 హెక్టాలలో సాగు చేసే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా 36 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని అంచనా వేయడం జరిగిందన్నారు. జిల్లాకు అందిన యూరియాను మండలాల వారీగా పంటల సాగు విస్తీర్ణాన్ని బట్టి సక్రమంగా కేటాయించాలన్నారు. రైతులకు అవసరమైనంత యూరియా మాత్రమే విడతల వారీగా పంపిణీ చేయాలన్నారు. మార్క్ ఫెడ్ గోదాములలో అవసరమైనంతగా యూరియా బఫర్ నిల్వలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. గ్రామస్థాయిలో గ్రామ వ్యవసాయ సహాయకులు (విఏఏలు) రైతులందరికీ అవసరమైనంత మేరకే యూరియా వాడకంపై అవగాహన కలిగించాలన్నారు. అనవసరంగా యూరియా దొరకలేదు, కొరత ఉంది అనే అంశాలపై రైతుల్లో ఎలాంటి ఆందోళన లేకుండా ముందుగానే అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో పంటల విస్తీర్ణము, యూరియా అవసరాలు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగానికి నివేదికలు అందజేయాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వివి నాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, మార్క్ఫెడ్ డి ఎం మురళీ కిషోర్, డి సి ఓ చంద్రశేఖర్, వ్యవసాయ శాఖ ఏడీలు మనిధర్, కవిత, శ్యామల, రమాదేవి, జయప్రద, శ్రీనివాస్, ఏవో శాంత, స్పీక్, క్రిభ్కో కంపెనీల ప్రతినిధులు, టోకు అమ్మకం డీలర్లు తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News