Breaking News

ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం ఫైల్ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంటే క్రమశిక్షణ చర్యలు తప్పవు- డిప్యూటీ డైరెక్టర్ రంగరాజు అల్లాడి

ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం ఫైల్ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రంగరాజు అన్నారు. శనివారం మధ్యాహ్నం విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం, నూతన భవనంలోని మీటింగ్ హాల్ లో ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం టి డి ఆర్ బాండ్స్ బిల్డింగ్ ప్లాన్ లపై డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఓపెన్ ఫారం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం పొడిగించిన గడువు ఏప్రిల్ 23, 2026 తో ముగియనున్న నేపథ్యంలో సిబ్బంది ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం లో గల ఫైళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని, దీర్ఘకాలంగా పెండింగ్లో ఫైలు ఎవరి వద్ద ఉంటుందో వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని అన్నారు.

ఓపెన్ ఫారంలో పాల్గొన్న ప్రజలలో ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ లో స్పాట్ పేమెంట్ చేయగా వారి ప్రొసీడింగ్స్ ను వెంటనే జారీ చేశారు. టిడిఆర్ బాండ్స్, బిల్డింగ్ ప్లాన్స్ పై ప్రజల సందేహాలను తీర్చారు.

ఈ కార్యక్రమంలో సుబ్బారావు ఆర్. డి డి. టి పి , రాజ్యలక్ష్మి ఏడి డి టి పి, వై రాంబాబు ఏసీపీ, పి. మోహన్ బాబు ఏసిపి, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *