తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ ట్రస్ట్ 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రక్తదానం ప్రాణాలను రక్షించే అత్యంత పవిత్రమైన సేవ అని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకుని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువత ఈ విధమైన సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ఆనందదాయకమని తెలిపారు.
అలాగే, ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత, స్వచ్ఛంద సేవకులు పాల్గొని రక్తదానం చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News