Breaking News

ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్యసేవలు తక్షణమే పునరుద్దరించాలి… జి.కోటేశ్వరరావు డిమాండ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్యశ్రీ పధకం క్రింద ప్రవేటు ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 3 వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించి ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు లెనిన్ సెంటర్ లో భారత కమ్యూనిస్టు పార్టీ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భముగా సిపిఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల కాలవ్యాధిలో రాష్ట్రంలో ప్రవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ పథకం క్రింద వారికీ రావాల్సిన బకాయిల కోసం 2024 , 2025 అక్టోబర్ నెలలో మరల ఇప్పుడు ఏప్రిల్ 1 వ తేదీ నుండి ఇలా 3 పర్యాయాలు వారి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదల చేసి సమ్మె చేయడం జరిగినది అని అయన తెలియజేసారు. దీనిని బట్టి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ద కనబరుస్తుందో అర్ధం అవుతుందని ఎద్దేవా చేసారు. గత అక్టోబర్ లో ప్రవేటు ఆసుపత్రుల వారు సమ్మె చేసిన్నపుడు ఆనాటికి ఉన్న 2700 కోట్ల బకాయిలను డిసెంబర్ నాటికీ తీరుస్తామని హామీ ఇచ్చి సమ్మె విరమింపజేసినా ప్రభుత్వం వారు చెప్పిన గడువు పూర్తయి 3 మాసాలు గడచినా ఇప్పటివరకు ఎటువంటి చెల్లింపులు చేయకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనంగా ఉందని విమర్శించారు. ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తముగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య సేవలను పొందుతున్న పేద, మధ్యతరగతి రోగులు తీవ్రముగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అయన ఆవేదన వ్యక్తం చేసారు. ఆరోగ్యశ్రీ బకాయిలు 3 వేల కోట్లకు చేరుకోవడంతో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వారు చెబుతున్నట్లు పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, సిబ్బంది జీతాలు, ఔషదాలు మొదలగు వాటి వలన ఆసుపత్రుల నిర్వహణ కష్టదాయకంగా మారిందని వీటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి, వైద్య శాఖ మంత్రి వెంటనే జోక్యం చేసుకొని వారికీ చెల్లించాల్సిన 3 వేల కోట్ల బకాయిలను చెల్లించి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్దరించాలని సిపిఐ విజయవాడ నగర సమితి తరపున ప్రభుతాని డిమాండ్ చేసారు.

రాష్ట్రము లోని కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్య వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగునైనా సదుపాయలు కల్పించడం, ఉన్న వైద్య సేవలను సరయూన రీతిలో ప్రజలకు అందుబాటులో ఉంచడం పూర్తిగా వైఫల్యం చెందిందని. ఇటువంటి పరిస్థితులలో ప్రజలు వారి జీవించే హక్కు కోసం లక్షలు వేచ్చించి ప్రవేటు వైద్యనీ ఆశ్రయించాల్సిన పరిస్థితికి ప్రభుత్వం తీసుకువచ్చిందని అయన అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వారి బేషజాలు విస్మరించి గత ప్రభుత్వ హాయంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించి తద్వారా కాలేజీలకు అనుసంధానంగా ఉండేటటువంటి ప్రభుత్వ వైద్యశాలల ద్వారా పేద ప్రజలకు వైద్య సేవలను అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

ఈ కార్యక్రమానికి నగర సహాయ, నక్క వీరభద్రరావు అధ్యక్షత వహించగా, నగర సహా య కార్యదర్శి లంక దుర్గారావు వందన సమ్పర్పణ చేసారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శివర్గ సభ్యులు బుట్టి రాయప్ప, కె.వి.భాస్కరరావు, తాడి పైడయ్య, మూలి సాంబశివరావు, పంచాదర్ల దుర్గంబ,అప్పూరుబోతు రాము, కొట్టు రమణారావు,సంగుల పేరయ్య, కార్యవర్గ సభ్యులు డి.వి.రమణ బాబు, తూనం వీరయ్య, కోడలి ఆనందరావు, ఓర్సు భారతి, దోనేపూడి సూరిబాబు, దుగ్గిరాల సీతారావమ్మ, ఎస్.కె.నజీర్, మరియు నగర నాయకులు ఎస్.కె.అలీ, పడాల కనకారావు, నీలం భాగ్యలక్ష్మి, లంక ప్రసాద్, మూలి శివన్నారాయణ, బందెల రాజు, రాచకుల శ్రీనివాసరావు, డి.శ్రీనివాసరావు , బోర రామకృష్ణ, మోకా దుర్గారావు, దుర్గాసి రావణమ్మ, మురుగేషన్ రాము, పగిదిఁకత్తుల రాము, మద్దెల గుర్నాధం, ఎస్.కె.బాషా, సయ్యద్ అప్సర్, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు కె.ఆర్.ఆంజనేయులు, చీర్ల రామస్వామి, బెవర శ్రీను, కె. విజయ్ , బత్తుల తిరుపతయ్య, జి.రవికుమార్, జి.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *