Breaking News

అనధికార లేఅవుట్‌ల క్రమబద్ధీకరణకు చివరి అవకాశం: కమిషనర్ కె. మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అనధికార లేఅవుట్‌లలో ప్లాట్లు కలిగి ఉన్న యజమానులు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)లో తమ ప్లాట్లను ఈ నెల 23వ తేదీలోపు క్రమబద్ధీకరించుకోవాలని, లేకుంటే గడువు అనంతరం ఆయా లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే జనవరి 23 నుండి ఏప్రిల్ 23 వరకు మూడు నెలల పాటు ఎల్ఆర్ఎస్ గడువు పొడిగించిందని, ఈ నెల 23వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని ప్లాట్ల యజమానులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తమ దరఖాస్తుల చేసుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న అన్ని దరఖాస్తులకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెండింగ్‌లో ఉన్న దస్త్రాలను వెంటనే పరిష్కరించాలని పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థకు ఇప్పటివరకు లేవుట్ రెగ్యులేషన్ స్కీంలో 3723 దరఖాస్తులు అందగా, అందులో 2185 దరఖాస్తులు పరిష్కరించబడ్డాయని, మిగిలిన 1538 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని కమిషనర్ వెల్లడించారు. అనుమతించని లేఅవుట్లలో ఇంకా చాలా మంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని, ఏప్రిల్ 23వ తేదీ గడువు ముగిసిన తర్వాత అనధికార లేఅవుట్‌లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ లో దరఖాస్తు చేయని లేఅవుట్‌లలోని ప్లాట్లకు భవిష్యత్తులో భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయబడవని, అంతేకాకుండా అట్టి ప్రాంతాల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించబడవని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున, ప్లాట్ల యజమానులు పారదర్శకంగా ప్రభుత్వం కల్పించిన ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *