Breaking News

రెవెన్యూ వసూళ్ళ లో నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థ అడ్వాన్సు టాక్స్ రెవెన్యూ వసూళ్ళ లో నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలని, అందుకు తగిన విధంగా రోజువారి వసూళ్లు జరగాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరం నందు రెవిన్యూ వసూళ్ళ పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు తొలుతగా రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, రెవిన్యూ అధికారుల వారీగా, సచివాలయాల వారీగా అడ్వాన్సు టాక్స్ క్రింద రెవిన్యూ వసూళ్ళ పై పూర్తి స్తాయిలో సమీక్షించి, కొంత మంది రెవిన్యూ సిబ్బంది తక్కువ శాతం వసూళ్లు చేశారని, మిగిలిన 12 రోజులు మాత్రమె ఉందని, కావున అధికారులు రెవిన్యూ వసూళ్లు పై మాత్రమె ద్రుష్టి సారించాలని, నిర్దేశిత లక్ష్యాల ప్రకారం వసూళ్లు జరగాలంటే రెవిన్యూ విభాగానికి సంబంధించి కార్యదర్శి స్తాయి నుండి డిప్యూటీ కమిషనర్ వరకు క్షేత్ర స్తాయిలో పర్యటించి, గత సంవత్సరం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వారితో పాటు బకాయిలు లేని ప్రతి ఒక్కరు కూ అడ్వాన్సు టాక్స్ సద్వినియోగం చేసుకునేలా డోర్ టు డోర్ తిరిగి పన్ను చేల్లిపింపు దారులకు పన్ను వివరాలతో కూడిని పూర్తి సమాచారాన్ని అందించాలన్నారు. మే 1 తరువాత అడ్వాన్సు టాక్స్ వినియోగిన్చుకోలేకపోయామని ఎవరైనా పిర్యాదు చేసిన యెడల దానికి బాధ్యత సంబంధిత కార్యదర్శి మరియు రెవిన్యూ ఇన్స్పెక్టర్ బాధ్యత వహించాలన్నారు. అంతేకాక ప్రభుత్వం పన్ను బకాయిల వడ్డీ పై 50 శాతం రాయితీ అదనంగా ఏప్రిల్ నెలాఖరు వరకు అవకాశం కల్పించినప్పటికీ ఆశించిన స్తాయిలో వసూళ్లలో పురోగతిలేదన్నారు. బకాయిదారులకు పూర్తి సమాచారం అందేలా చూడాలని, ప్రజల అవగాహన నిమిత్తం ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా నగర ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, అడ్వాన్సు టాక్స్ మరియు వడ్డీ పై 50 శాతం రాయితీ గడువు కేవలం 12 రోజులు మాత్రమె గడువు కలదని, ఆఖరి రోజువరకు వేచి చూడకుండా ముందుగా సద్వినియోగ పరచుకోవాలన్నారు. అందునిమిత్తం నగర పాలక సంస్థ ప్రతి రోజు సెలవు దినాల్లో కూడా ఉదయం 7 నుండి రాత్రి 9 గంటల వరకు కాష్ కౌంటర్లు పనిచేస్తున్నాయని, పన్ను వివరాల సమాచారం కొరకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశామన్నారు. ఆస్తి పన్ను చెల్లింపు కొరకు వచ్చే వారి కొరకు వేసవి దృష్ట్యా కౌంటర్ల వద్ద టెంట్లు, త్రాగునీరు మరియు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడానికి అధికారులను ఆదేశించామన్నారు.
సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు సి.హెచ్ శ్రీనివాస్, బి.శ్రీనివాసరావు, సాంబశివరావు, రెవిన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *