Breaking News

అదనపు కమిషనర్ ఓబులేసు సేవలు అభినందనీయం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అదనపు కమిషనర్ ఓబులేసు సేవలు అభినందనీయమని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ గారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16న జారీ చేసిన మునిసిపల్ బదిలీల ఉత్తర్వులలో నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న చల్లా ఓబులేసు ను కర్నూల్ నగర పాలక సంస్థ కమిషనర్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు చేసిందని, ఈ సందర్భంగా నేడు గుంటూరు నగర పాలక సంస్థలో కౌన్సిల్ సమావేశ మందిరంలో కమిషనర్ గారు అదనపు కమిషనర్ ను శాలువాతో సన్మానించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గత సంవత్సరంన్నరగా అదనపు కమిషనర్ విధులు నిర్వహిస్తున్నారని, బాధ్యతులు తీసుకున్ననాటినుండి అంకిత భావంతో, కేటాయించిన విధులను విజయవంతంగా నిర్వహించారన్నారు. నేను కమిషనర్ గా విధులలో చేరినప్పటినుండి కేటాయించిన ఎన్నికలు, జనాభా లెక్కలు, ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమాలు వంటి అదనపు విధులను కూడా సమిష్టి కృషితో దిగ్విజయంగా నిర్వహించారని, ఆయన సహకారం మరువలేనిదని ఈ సందర్భంగా తెలియచేశారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు సి.హెచ్ శ్రీనివాస్, బి. శ్రీనివాసరావు, సాంబశివరావు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *