విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్క్ షాప్ లో పాల్గొన్న ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు మరియు పక్షమ గొదావరి జిల్లాలకు చెందిన మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా బాలల సంరక్షణ అధికారులు, సీడీపీఓలు, హెల్త్, సెర్ప్, మెప్మా, ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్ మరియు గ్రామ & వార్డు సచివాలయ జిల్లా అధికారులు
మే నెల 01 నుంచి జూన్ 10 వరకు కిషోరి వికాసం వేసవి సమావేశాలు..
ఎన్టీఆర్ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ షేక్ రుక్సానా సుల్తాన బేగం అధ్యక్షతన శనివారం విజయవాడ లో ఇరిగేషన్ ట్రైనింగ్ హల్ లో కిశోరి వికాసంపై ప్రాంతీయ వర్క్‌షాప్ నిర్వహించబడింది.
ఈ వర్క్‌షాప్‌లో బాలికల సాధికారిత, భద్రత, విద్యా మరియు నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా వివిధ అంశాలపై చర్చలు జరిగాయి.
ప్రాజెక్ట్ డైరెక్టర్ డి శ్రీలక్ష్మి మాట్లాడుతూ కిశోరి బాలికల సమగ్ర అభివృద్ధి కోసం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచిస్తూ కిషోరి వికాసం వేసవి సమావేశాలు కౌమార బాలికలు మరియు కౌమార బాలురకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో మే 1వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు నిర్వహించబడతాయని అన్నారు . ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు కౌమార బాలబాలికలు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని మరియు విజయవంతం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా సెర్ప్ అధికారి హరినాథ్ మాట్లాడుతూ.. కిషోరి వికాసం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కిషోరి దశలో బాలికలకు సరైన మార్గదర్శకత్వం, ఆరోగ్య పరిరక్షణ, విద్య మరియు నైపుణ్యాల అభివృద్ధి ఎంతో అవసరమని తెలిపారు. ఈ దశలో సమగ్ర అభివృద్ధి సాధిస్తే, భవిష్యత్తులో వారు ఆత్మవిశ్వాసంతో సమాజంలో ముందుకు సాగగలరని పేర్కొన్నారు. అలాగే బాలికల సాధికారితకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి కిషోరి బాలికల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ అధికారి శ్రీ బాను నాయక్ మాట్లాడుతూ యువత అవగాహన లేక చాలా మంది యువతి యువకులు ఎయిడ్స్ బారినపడుతున్నారని పేర్కొన్నారు. కిశోరి వికాసం కార్యక్రమలలో ఎయిడ్స్ పై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఎయిడ్స్ కంట్రోల్ పై పనిచేస్తున్న స్వచ్చంద సంస్థలను భాగ్యస్వాములు చెయ్యాలని సూచించారు.
తదుపరి ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్ట్ శ్రీమతి షేక్ రుక్సానా సుల్తాన బేగం మాట్లాడుతూ… కిశోరి వికాసం కార్యక్రమ లక్ష్యాలు మరియు మార్గదర్శకాలను వివరించారు. అలాగే వేసవి శిబిరాల నిర్వహణ విధానంపై కూడా సూచనలు అందించారు. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కిషోరి వికాసం వేసవి సమావేశాలు మే 1వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు నిర్వహించబడనున్నాయి. ఈ సమావేశాలు కౌమార బాలికలు మరియు కౌమార బాలురకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో చేపడుతున్నారు. ఈ కార్యక్రమాలలో ఆరోగ్యం, పోషణ, వ్యక్తిత్వ వికాసం, విద్యా ప్రాముఖ్యత, లైంగిక మరియు ప్రజనన ఆరోగ్యం, బాల్య వివాహాల నివారణ, బాలల రక్షణ వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చలు మరియు అవగాహన కార్యక్రమాలు గ్రామ మరియు వార్డు స్థాయిలో 11సంవత్సరాలు వయస్సు నుండి 18 సంవత్సరాల వయస్సు గల కౌమార బాల బాలికలకు నిర్వహించబడతాయని అన్నారు. ఈ సమావేశాల ద్వారా కౌమార దశలో ఉన్న బాలబాలికలకు సరైన మార్గదర్శకత్వం అందించడం, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, మరియు సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగడానికి సహాయపడడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
కార్యక్రమంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖ సీనియర్ కన్సల్టెంట్ నర్సింహమూర్తి, యూనిసెఫ్ సీనియర్ కన్సల్టెంట్ మేరీ జాన్స్, పడాల చారిటబుల్ ట్రస్ట్ సీఈవో ప్రసాద్ మాట్లాడుతూ.. కిషోరి వికాసం గ్రూపుల ప్రాముఖ్యతను వివరించారు. ఈ గ్రూపుల ద్వారా బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందడం, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందడం, మరియు సామాజిక సమస్యలపై అవగాహన పెరగడం జరుగుతుందని తెలిపారు. అలాగే బాలలపై జరిగే దుర్వినియోగం , బాల్య వివాహాలు వంటి సమస్యలపై చర్చిస్తూ, వీటి నివారణకు సమాజం మొత్తం కలసి పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. హెచ్‌ఐవి/ఎయిడ్స్, లైంగిక మరియు ప్రజనన ఆరోగ్యం, లైంగిక విద్య వంటి కీలక అంశాలపై నిపుణులు వివరణ ఇచ్చారు. ఈ విషయాలపై సరైన అవగాహన కలిగి ఉండటం ద్వారా బాలికలు ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన జీవితాన్ని గడపగలరని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కిషోరి బాలికలలో అవగాహన పెంపొందించడం, స్వీయ రక్షణపై చైతన్యం కల్పించడం, మరియు భవిష్యత్తులో సమాజ నిర్మాణంలో వారి పాత్రను బలోపేతం చేయడం లక్ష్యం అన్నారు.
ఈ ప్రాంతీయ వర్క్‌షాప్‌లో గ్రామ & వార్డు సచివాలయల జిల్లా అధికారి జ్యోతి, ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు మరియు పక్షమ గొదావరి జిల్లాలకు చెందిన మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్లు , పి శారద, జిల్లా బాలల పరిరక్షణ అధికార్లు యమ్ రాజేశ్వరరావు, సూర్యచక్రవేణి, రాజేష్, కిషోర్,, మిషన్ కో-ఆర్డినేటర్లు, సీడీపీవోలు, డీసీపీవోలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News