విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షతపై రూపొందించిన డాక్యుమెంటరీని, ఆయన జీవిత విశేషాలతో కూడిన ‘ధర్మచక్రం’ సినిమాను చంద్రన్న జన్మదిన వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని 13 జిల్లాలలో ప్రదర్శిస్తున్నట్లు దర్శక నిర్మాత పసుపులేటి వెంకటరమణ వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు సందర్భంగా వేడుకల వివరాల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు నిస్వార్థంగా అందిస్తున్న సేవలను, ఆయన పాలనలోని విశిష్టతలను ప్రజలకు వివరించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యమంత్రిపై జరుగుతున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టేలా, వాస్తవాలను తెలియజేయడమే లక్ష్యంగా ఈ చిత్రాలను నిర్మాణం చేసినట్లు పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News