Breaking News

రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్ని అంటిన సీఎం చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలు

-మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల ఆధ్వర్యంలో పెద్దఎత్తున సేవ కార్యక్రమాలు
-రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు చేసిన చంద్రబాబు నాయుడు అభిమానులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అభిమానులు, కార్యకర్తలు, ఘనంగా జరుపుకున్నారు. అన్ని నియోజక వర్గాల్లోని గ్రామ స్థాయి వరకు ఒక పండుగ వాతావరణంలా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రోగులు, వృద్ధులకు పండ్లు పంచిపెట్టి… భారీ కేక్ లు కట్ చేసి తమ అభిమాన నాయకుడిపై ఉన్న ప్రేమను వ్యక్త పరిచారు.

మంత్రులు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు : దేవ దాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సీఎం చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద మంత్రల నడుమ హోమ పూజ కార్యక్రమాలు చేస్తూ.. భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, స్థానిక టీడీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో శింగరాయ కొండలో ఘనంగా సీఎం బర్త్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో బనగానపల్లిలో చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఆహారం, పండ్లు అందజేశారు. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో పాలకొల్లులో సీఎం పుట్టిన రోజు వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా వికలాంగులకు దుస్తులు, పండ్లు, ఆహారం పంచిపెట్టారు. మంత్రి వాసం శెట్టి సుభాష్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. యలమంచిలిలో జరిగిన సీఎం పుట్టిన రోజు వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర, ప్రగఢ నాగేశ్వరా రావు పాల్గొన్నారు.

163 అన్న క్యాంటిన్లలో జరిగిన సేవా కార్యక్రమాల్లో టీడీపీ నేతలు పాల్గొనడం జరిగింది. 12 మంది మంత్రులు, 90 మంది ఎమ్మెల్యేలు, 30 మంది నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు, ఇద్దరు అసెంబ్లీ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. 160కి పైగా దేవాలయాల్లో, 80కి పైగా చర్చీల్లో, 75కు పైగా మసీదుల్లో చంద్రబాబునాయుడు గారు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. 175 నియోజకవర్గాల్లో కేక్ కటింగ్ లు, 70 కి పైగా నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు, 60 నియోజకవర్గాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 110 ప్రాంతాల్లో పేదలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. 127 నియోజకవర్గాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు, దుప్పట్లు పంపిణీ చేసి తమ అభిమాన నాయకుడిపై ఉన్న ప్రేమను వ్యక్త పరిచారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *