-అభిమానుల సమక్షంలో “మన చంద్రన్న 2 పుస్తకం” విడుదల
-గుమ్మడి గోపాలకృష్ణ ఆలపించిన “తెలుగునేల పుణ్యఫలం” పాట విడుదల
-గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 76 వసంతాల గుర్తుగా 76 కేజీల కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న అభిమానులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు క్షేమంగా, ఆరోగ్యంగా నూరేళ్లు వర్ధిల్లాలని కోరుతూ పార్టీ శ్రేణులు ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జాతీయ ఉపాధ్యక్షులు టీడీ జనార్ధన్, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు సహా పలువురు కీలక నేతలు, నాయకులు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరపుకున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. “చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ స్వర్ణాంధ్రగా మారుతుందని, ఆయన అనుభవం రాష్ట్ర భవిష్యత్తుకు శ్రీరామరక్ష” అని కొనియాడారు. కార్యకర్తల కేరింతలు, నినాదాలతో పార్టీ కార్యాలయం పండుగ వాతావరణాన్ని తలపించింది. అనంతరం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయాలు, ప్రజా సంక్షేమంపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ పోలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్థన్ రచించిన *”మన చంద్రన్న 2″ పుస్తకాన్ని అభిమానులు సమక్షంలో విడుదల చేశారు. ముందుగా తొలి కాపీని సీఎం చంద్రబాబు గారికి టీడీ జనార్థన్ గారు అందజేశారు. అనంతరం ఏపీ నాటక రంగ అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ స్వయంగా రచించి పాడిన “తెలుగునేల పుణ్యఫలం చంద్రబాబు నాయుడు” అనే వీడియో పాటను విడుదల చేశారు. ఏపీ గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు 76 వసంతాలకు గుర్తుగా 76 కేజీల భారీ కేక్‌ను కట్ చేశారు. సీఎం జన్మదినం సందర్భంగా పార్టీ కార్యాలయంలో మిఠాయిలు పంపిణీ చేయడంతో పాటు, పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు, ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ, ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి, ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్ పీతల సుజాత, ఏపీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఏపీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి బోర్డు ఛైర్మన్ కృష్ణయ్య, ఏపీ ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డ్ చైర్మన్ కె.కె.చౌదరి, నాలెడ్జ్ సెంటర్ ఛైర్మన్ గురజాల మాల్యాద్రి, శ్రీశైలం ఆలయ కమిటీ మెంబర్ ఏవీ రమణ, టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి పాతర్ల రమేష్, అన్నవరం దేవస్థానం మెంబర్ రావిపాటి సత్యనారాయణ, గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వందనదేవి, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు, నేతలు వేమూరి ఆనందసూర్య, బోద్దులూరి వెంకటేశ్వరరావు, చప్పిడి రాజశేఖర్, చెన్నుపాటి గాంధీ, పర్చూరి కృష్ణ, వల్లూరి కిరణ్ తదితరలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News