Breaking News

27 తేదీలోపు మసీదులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లాలోని మసీదు మేనేజింగ్ కమిటీలకు మరియు గౌరవ వేతనం పొందుతున్న ఇమామ్‌లు, మౌజన్లు తమ మసీదు రిజిస్ట్రేషన్ కోసం మసీదు సంబంధిత ల్యాండ్ డాక్యుమెంట్స్‌తో జిల్లా వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో మసీదుల రిజిస్ట్రేషన్ (UMEED PORTAL) కార్యక్రమం సముచితంగా నిర్వహించబడుతున్నదని జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బాని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కావున, ఎన్టీఆర్ జిల్లాలోని మసీదు మేనేజింగ్ కమిటీలు మరియు గౌరవ వేతనం పొందుతున్న ఇమామ్‌లు, మౌజన్లు తమ మసీదు రిజిస్ట్రేషన్ (UMEED PORTAL) కోసం మసీదు సంబంధిత ల్యాండ్ డాక్యుమెంట్స్‌తో జిల్లా వక్ఫ్ బోర్డ్ కార్యాలయం, ఐదవ అంతస్తు, ఇమ్దాద్ ఘర్ కాంప్లెక్స్, K.R. మార్కెట్, విజయవాడలో 27.04.2026 తేదీలోపు మసీదులు రిజిస్ట్రేషన్ చేసుకోవలసిందిగా కోరడమైనది.

UMEED PORTAL‌లో మసీదు రిజిస్ట్రేషన్ చేయనియెడల ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనం రద్దు చేయబడును. అందువల్ల, సంబంధిత మసీదు మేనేజ్మెంట్‌లు నిర్దిష్ట గడువు లోపు అవసరమైన పత్రాలను సమర్పించి సహకరించవలసిందిగా కోరడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *