-ప్రవేశపెట్టిన అజెండాల పై ఏకగ్రీవ తీర్మానం.
-ముస్లిం విద్యార్దులకు కార్పొరేట్ విద్యకు అయ్యే ఖర్చు భరించేందుకు బోర్డ్ అంగీకారం.
-ఏటా 500 మందికి ఉచిత విద్య. మొదటి ఏడాది 250 మందికి రెండవ ఏడాది నుంచి 500 మందికి.
-తాలిం ఏ హునర్ పేరు తోనే విద్యా పథకం.
-షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని కాలేశ్వర రావు మార్కెట్ వద్ద గల ఏపీ వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 14 వ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన అజెండా లపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా పలు మ్యానేజింగ్ కమిటీలు, పలు ముతవల్లీలను నియమించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, ఏపీ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా 500 మంది ముస్లిం విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత కార్పొరేట్ విద్యను అందించేందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. జేఈఈ మెయిన్స్ ,నీట్ శిక్షణ అందిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ట్యాలెంట్ టెస్ట్ ద్వారా ఎంపిక చేసిన విద్యార్థులకు ఉచిత రెసిడెన్షియల్ విద్య అందించేందుకు దానికి అయ్యే ఖర్చును పూర్తిగా వక్ఫ్ బోర్డు భరించే విధంగా బోర్డు సమావేశం లో తీర్మనించామని తెలిపారు. ప్రత్యేకంగా నిర్వహించిన ట్యాలెంట్ టెస్ట్ ద్వారా ఎంపికైన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని నిర్ణయించారు. ఈ చర్యతో ముస్లిం విద్యార్థుల ఉన్నత విద్యకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. మొదటి ఏడాది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి గాను 250 మందికి ఉచిత రెసిడెన్షియల్ కార్పొరేట్ విద్య ను అందిస్తామని రెండవ ఏడాది నుంచి ఏటా 500 మందికి ఉచిత విద్యను అందిస్తామని తెలిపారు. పదవ తరగతి ఫలితాలు విడుదలైన అనంతరం వచ్చే నెలలో ట్యాలెంట్ టెస్ట్ నిర్వహించి పథకాన్ని ప్రారంభస్తామని తెలిపారు. ఇప్పటికే తాలీం ఏ హునర్ పేరుతో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు నిర్వహిస్తున్నామని అదే పేరుతో విద్యా పథకం కూడా కొనసాగుతుందని తెలిపారు. సమావేశంలో బోర్డ్ సభ్యులైన శాసనమండలి సభ్యులు మొహమ్మద్ రుహుల్లా, శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్, ఖాజా, అక్రమ్, ఇస్మాయిల్ బేగ్, ఆఫియా, దావూద్ భాషా బఖావి, బేపారి జాకీర్ అహమద్ సీఈఓ యాఖుబ్ ఖాజీ, వక్ఫ్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News