Breaking News

సంక్లిష్ట శస్త్రచికిత్సలు విజయవంతం!

-పూర్తిగా కోలుకున్న క్షతగాత్రులు
-తెనాలి జిల్లా వైద్యశాల డాక్టర్ల ఘనత!
-మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు
-ఒకరికి పీఎం-రాహత్, మరోకరికి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు కింద ఉచిత వైద్య సేవలు
-సెకండరీ ఆసుపత్రుల ద్వారా రోగులకు అందుతున్న ఉత్తమ వైద్య సేవల పరంపర

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని సెకండరీ ఆసుపత్రుల్లోనూ సంక్లిష్టమైన శస్త్ర చికిత్సలను వైద్యులు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. సాధ్యమైనంత వరకు బోధనాసుపత్రులకు రిఫర్ చేయకుండానే ఆపరేషన్ ధియేటర్లో ఉన్న అత్యాధునిక మెషిన్లు, ఇతర సౌకర్యాలతో జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రుల్లోని వైద్యులు రోగులకు ఉత్తమ సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తెనాలి జిల్లా ఆసుపత్రిలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో తీవ్రంగా గాయపడిన సామ్రాజ్యం (65), నాంచారమ్మ (38) అనే మహిళలకు గత శనివారం (ఏప్రిల్ 18) ఎనస్ధిటిస్టుల సహకారంతో ఆర్థో వైద్య బృందం చేసిన క్లిష్టమైన శస్త్రచికిత్సల ద్వారా వారు పూర్తిగా కోలుకున్నారని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు నేడొక ప్రకటనలో తెలిపారు. సామ్రాజ్యం రోడ్డు ప్రమాద కేసును పీఎం- రాహత్ కింద, నాంచారమ్మ కేసును ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు కింద నమోదుచేసి, ఉచితంగా చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. రోడ్డు ప్రమాద బాధితులకు ఉత్తమ చికిత్స అందించిన వైద్యులు, ఇతర సిబ్బందికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు తెలిపారు. ఇదే స్పూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలన్న ఆకాంక్షను వ్యక్తంచేశారు.
డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోని ఆసుపత్రులలో జనవరి నుంచి ఇటివల వరకు రోగులకు ఉత్తమ సేవలందించిన వైద్య బృందాలను అభినందిస్తూ డిఎస్హెచ్ నుంచి సుమారు 30 వరకు ప్రశంస పత్రాలను చక్రధరబాబు పంపారు.

బరువు 130 కేజీలు..ఆపైన ఉబ్బస వ్యాధి!

రేపల్లె ప్రాంతానికి చెందిన 130 కేజీల నాంచారమ్మ వయస్సు 38 ఏళ్ళు . ఈ నెల 13న నందివెలుగు దగ్గర ఆటో బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. కుడి వైపు మోచేయి పైభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ముఖ్యంగా ఎముక (హ్యూమరస్) ముక్కముక్కలైంది. ఈమెకు చిన్న వయసు నుంచే ఉబ్బస వ్యాధి ఉంది. ఈమెకు హిమోగ్లోబిన్ శాతం 8 గ్రాముల వరకు మాత్రమే ఉంది. హైపో థెరాయిడ్తో బాధపడుతున్నారు.ఈ పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నాంచారమ్మ మోచేయికి శస్త్రచికిత్స చేయడం తప్పనిసరని వైద్యులు నిర్ధారించారు. అయితే.. అధిక బరువుతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కలిగిన ఈమెకు పెద్ద మత్తు మందు (జనరల్ ఎనస్థిషియా) ఇవ్వడంలో వైద్యులు తీవ్రంగా శ్రమించారు. ఊపిరితిత్తుల్లో సమస్య కూడా ఉండడంతో చివరికి దెబ్బతిన్న మోచేయి వరకు మాత్రమే మత్తు (రూటు బ్లాక్) ఇచ్చారు. ఈ ప్రక్రియ సంక్లిష్టమైంది. అయినా నాంచారమ్మ విషయంలో అది తప్పలేదు. బాధితురాలు స్పృహలో ఉండగానే రెండు గంటల్లో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తిచేశారు.

వృద్ధురాలి తొడ భాగం నుజ్జునుజ్జు.!

కొల్లిపర ప్రాంతానికి చెందిన సామ్రాజ్యం (65) భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై వస్తున్నప్పుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. కొల్లిపర సీహె చ్సీలో ప్రాథమిక చికిత్స పొందిన అనంతరం సామ్రాజ్యాన్ని 108 అంబులెన్సు ద్వారా తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. ఎడమ తొడ ఎముక తునాతునకలైంది. ఈ నెల 17వ తేదీ ఆసుపత్రిలో అర్థరాత్రి చేరగా మరసటిరోజే అత్యవసరంగా ‘సూప్రకాండైలార్ లాకింగ్ ప్లేటు సిస్టమ్’ (Supracondylar locking plate system)
విధానంలో తునాతునాకలైన ఎముక భాగాలను ఒకచోటకు పేర్చి స్క్రూలతో బిగించారు. ఈమె ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు.

ఆసుపత్రి నుంచి వెళ్లిపోతానని.. చెప్పా.. సామ్రాజ్యం!

“శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నేను తెనాలి జిల్లా ఆసుపత్రికి వచ్చినప్పుడు ఇక్కడ వైద్యం సరిగ్గా అందుతుందో లేదో అన్న భయంతోపాటు నొప్పుల కారణంగా మరో ఆసుపత్రికి పోతానని చెప్పా. ఆసుపత్రి వైద్యులు నాకు ధైర్యం చెప్పి శస్త్రచికిత్స చేశారు. ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు బాగున్నాయి. వైద్యులు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు” అని సామ్రాజ్యం తెలిపారు. ఈ కేసును తెనాలి మూడో పట్టణ పోలీసు స్టేషన్లో పీఎం-రాహత్ కింద కేసు నమోదైంది. రూ.1.5 లక్షల ఉచిత వైద్యం అందుతోంది.అలాగే నాంచారమ్మకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత వైద్యం అందిస్తున్నారు. నాంచారమ్మ కూడా సంతృప్తి వ్యక్తం చేసారు, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆపరేషన్ థియేటర్లలో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు సమకూర్చినందువల్లే..|

“ప్రభుత్వ చొరవ కారణంగా ఆపరేషన్ థియేటర్లలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్లలో రెండు సియామ్ మిషన్లు ఉండడం, ఇతర అత్యాధునిక సౌకర్యాలు ఉన్నందువల్ల సంక్లిష్టమైన శస్త్ర చికిత్సలు చేయగలుగుతున్నాం. మల్టీపేరా మానిటర్స్, వర్క్ స్టేషన్, అత్యవసర చికిత్సకు నా సంబంధించిన పరికరాలు, ఆక్సిజన్, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. మంత్రి సత్య కుమార్ యాదవ్ కు కృతజ్ఞతలు అని” జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ టి.సౌభాగ్యవాణి, ఆపరేషన్ చేసిన సీనియర్ వైద్యులు హనుమంతరావు, మజీదా బేగం వివరించారు.

తెనాలి జిల్లా వైద్యశాలలోనే అధికం
రాష్ట్రంలోనే డిఎస్హెచ్ ఆసుపత్రుల్లో తెనాలి జిల్లా వైద్యశాలలో ఆర్దో విభాగంలో అత్యధిక శస్త్రచికిత్సలు రాష్ట్రంలోని జిల్లా ఆసుపత్రుల్లో తెనాలిలోనే అత్యధికంగా ఆర్థో విభాగంలో శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ 20వ తేదీ వర కు కలిపి 626 శస్త్రచికిత్సలు జరిగాయి. ఇందులో మేజర్ ఆపరేషన్లు 349.

సివిల్ సర్జన్ , ఆర్థో వైద్యుడు డాక్టర్ జె. హనుమంతురావు నేతృత్వంలో వైద్యులు వెంకటేశ్వరరావు, సాయిరామ్, జితేంద్ర, లిఖిత్, ఎనస్థీషియా సీనియర్ వైద్యులు మజీదా బేగం నేతృత్వంలో డాక్టర్ ప్రదీప, డాక్టర్ షాలినీ, డాక్టర్ బిందుతోపాటు సీనియర్ స్టాఫ్ విజయకుమారి, గోపి, నాగలక్ష్మి పాల్గొని ఈ రెండు శస్త్రచికిత్సలను విజయవంతంగా ముగించారు.

డిఎస్హెచ్ ఆసుపత్రుల్లో ఉత్తమ సేవల వివరాలు మచ్చుకు..

అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రిలో గిరిజన మహిళ కడుపులోని 9.5 కిలోల కణితిని తొలగించారు. అలాగే అమలాపురం ఏరియా ఆసుపత్రిలోను 50 ఏళ్ళ మహిళ కడుపులో ఉన్న కణితిని తొలగించారు, రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో మోకాళ్ళ కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో 4.8 కిలోల శిశువు సహజ ప్రసవం జరిగేలా చేయటంలో సఫలం చెందారు. అలాగే రాజంపేట ఏరియా ఆసుపత్రిలో హైరిస్క్ గర్భిణీకి సాహసోపేతంగా వైద్యులు కాపాడారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *