Breaking News

అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ భవన్లు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-బీసీల అభ్యున్నతే సీఎం చంద్రబాబు లక్ష్యం
-చట్ట సభల్లో అన్ని బీసీ కులాలకు ప్రాతినిథ్యం కల్పించాలన్నదే చంద్రన్న ధ్యేయం
-త్వరలో ప్రారంభమయ్యే ఆదరణ 3.0లో విశ్వబ్రాహ్మణులకు ప్రాధాన్యం
-విశ్వబ్రాహ్మణుల కోసం మంగళగిరిలో శిక్షణ కేంద్రం ఏర్పాటు : మంత్రి సవిత

అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త :
అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ భవన్ లు నిర్మించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. చట్ట సభల్లో అన్ని కులాలకు ప్రాతినిథ్యం కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. త్వరలో అమలు చేయబోయే ఆదరణ 3.0 పథకంలో విశ్వబ్రాహ్మణులకు ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు. అనంతపురం నగరంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ పాలక మండలి సభ్యుల అభినందన కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు. బీసీల అభ్యున్నతి కోసమే అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు వెనుబడిన వర్గాలకు అన్ని విధాలా ప్రాధాన్యమిస్తున్నారన్నారు. బీసీల రాజకీయ, ఆర్థిక, సామాజిక గుర్తింపు కోసం వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు. చట్ట సభల్లో అన్నీ బీసీ కులాలకూ ప్రాతినిథ్యం కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ భవన్ లు నిర్మించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఇందుకోసం గతంలో రూపొందించిన అంచనాలను సవరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విశ్వ బ్రాహ్మణులకు అన్ని విధాలా ప్రోత్సాహించాలని కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. త్వరలో అమలు చేయబోయే ఆదరణ 3.0 పథకంలో విశ్వ బ్రాహ్మణులకు ఆధునిక పరికరాలు అందించే ఆలోచన చేస్తున్నామన్నారు. మారుతున్న కాలంతో పాటు నేటి తరం అభిరుచులకు అనుగుణంగా విశ్వ బ్రాహ్మణులకు శిక్షణ ఇవ్వడానికి మంగళగిరిలో స్కిల్ డవలప్ మెంట్ ఆధ్వర్యంలో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. విశ్వ బ్రాహ్మణుల ఆత్మగౌరవానికి ప్రాధాన్యమిస్తూ, విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహించామన్నారు. గత ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. అనంతరం రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ పాలక మండలి సభ్యులను ఆ సామాజిక వర్గీయులు మంత్రి చేతుల మీదు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ, కూటమి నాయకులు, కార్యకర్తలు, విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గీయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *