విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీశ IAS, విస్సన్నపేట మండలం తాటకుంట్ల గ్రామం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సాధికార సంస్థ (APCNF) ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ అమలవుతున్న వివిధ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతుల ద్వారా అడిగి తెలుసుకున్నారు . ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్న కూరగాయలు ఆకుకూరలు మామిడి తోటలను ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసే ప్రకృతి వ్యవసాయ స్టాల్స్‌లో ఉంచిన ట్రేసబిలిటీ QR కోడ్‌ను స్కాన్ చేసి పరిశీలించి,ఈ రోజు ఆ స్టాల్స్‌లో పాల్గొనే రైతుల పొలాలను స్వయంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రేసబిలిటీ వ్యవస్థలో భాగంగా QR కోడ్‌ను స్కాన్ చేసి, రైతుల వివరాలు, పంట సాగు విధానాలు మరియు అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ధృవీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు, MRO, RDO మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News