స‌జావుగా ర‌బీ ధాన్యం సేక‌ర‌ణ‌

– ఇప్ప‌టివ‌ర‌కు 25,808 మెట్రిక్ ట‌న్నుల కొనుగోలు
– రైతుల‌కు ఆర్ఎస్‌కేల ద్వారా సంతృప్తిక‌ర సేవ‌లు
– ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ర‌బీ ధాన్యం సేక‌ర‌ణ పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ ఆధ్వ‌ర్యంలో స‌జావుగా జ‌రుగుతోంద‌ని.. ఇప్ప‌టివ‌ర‌కు రైతుల నుంచి 25,808 మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని సేక‌రించ‌డం జ‌రిగింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు.
క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ బుధ‌వారం విస‌న్న‌పేట మండ‌లం, చండ్రుప‌ట్ల గ్రామ రైతు సేవా కేంద్రాన్ని (ఆర్ఎస్‌కే) త‌నిఖీ చేశారు. ఈ కేంద్రం ప‌రిధిలో జ‌రుగుతున్న ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించారు. రైతుల‌కు ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిన ఏర్పాట్ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటుచేసిన రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన సేవలను సమర్థవంతంగా అందిస్తూ, ధాన్యం విక్రయ ప్రక్రియను సులభతరం చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, వేగంగా ధాన్యం కొనుగోలు జరగాలని అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలుకు జిల్లా వ్యాప్తంగా 135 రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాట్లు చేశామ‌ని.. వీటిలో 74 ఇప్ప‌టికే ప్రారంభ‌మైన‌ట్లు తెలిపారు. అదేవిధంగా 24 మిల్లులు క్రియాశీలంగా ఉన్నాయ‌ని, ఆర్ఎస్‌కేల్లో 10,75,200 గోనె సంచుల‌ను అందుబాటులో ఉంచిన‌ట్లు తెలిపారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సదుపాయాలను వినియోగించుకొని, తమ ధాన్యాన్ని విక్ర‌యించుకోవాల‌ని సూచించారు. కొనుగోలు ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *