విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ ఆధ్వర్యంలో పిళ్ళైయార్ ఆయుర్వేద వైద్యశాల సౌజన్యంతో ఈనెల 27వ తేదీ సోమవారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గాంధీనగర్లో విజయవాడ చాంబర్ హాలులో ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు గడ్డం బాల వెంకట రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వైద్యశిబిరంలో ఎముకల పటుత్వ పరీక్ష, నాడీ పరీక్ష, శరీర పరిస్థితి, రక్తపోటు, బరువు, ఎత్తు, హృదయ స్పందన అవసరమైతే ఈసీజీ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారన్నారు. చాంబర్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, వివిధ వ్యాపార సంస్థల సిబ్బంది, ముఠా కార్మికులు, పేద ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రవికుమార్ కోరారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News