Breaking News

ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో జరిగిన సంఘటనలపై వినతిపత్రం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేషనల్ మెడికల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ తరుపున రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పి వి ఎస్ విజయభాస్కర్  ఆదేశాలు మేరకు ఈ రోజు ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ స్టేట్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ని విజయవాడలో కలిసి, ఇటీవల డాక్టర్ ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో జరిగిన సంఘటనలపై వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థినులు సమస్యను మీ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించి, మీరు స్వయంగా కళాశాలకు వెళ్లి విచారణ నిర్వహించడం అభినందనీయమని ఆమెకు తెలియజేశామన్నారు. మహిళా విద్యార్థుల భద్రతపై మీకున్న కట్టుబాటు వారికి ఎంతో నమ్మకాన్ని కలిగిస్తుందని పేర్కొన్నామన్నారు. అసోసియేషన్ తరఫున, ప్రభావిత విద్యార్థినులకు పూర్తి న్యాయం జరగాలని స్పష్టంగా కోరడమైనది. విచారణలో తేలిన అంశాల ప్రకారం సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించామన్నారు. అలాగే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు, లైంగిక వేధింపుల నివారణ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అవసరమని సూచించామన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణలో మా అసోసియేషన్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలియజేశాము. డాక్టర్ ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక సంస్థ కావున, వ్యక్తిగత సంఘటనల కారణంగా సంస్థ ప్రతిష్ట దెబ్బతినకుండా తగిన చర్యలు తీసుకోవాలని వినమ్రంగా కోరడమైనది. విద్యార్థుల్లో నమ్మకం పెంపొందించేందుకు, మీ నివేదికను నిబంధనల ప్రకారం వీలైనంత త్వరగా పబ్లిక్ డొమైన్‌లోకి తీసుకురావాలని అభ్యర్థించామన్నారు. నేషనల్ మెడికల్ అసోసియేషన్ తరఫున, విద్యార్థినులకు అండగా నిలుస్తూ, మీరు తీసుకునే చర్యలకు పూర్తి సహకారం అందిస్తామని తెలియజేశారు
దీనిపై స్పందిస్తూ, డాక్టర్ రాయపాటి శైలజ బాధిత విద్యార్థినులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ అండగా ఉంటుందని, వారికి భద్రతను పటిష్టం చేయడంతో పాటు కళాశాలలో రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తప్పు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం కి నివేదిక పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వేముల భాను ప్రకాష్, నేషనల్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ వెంకటరమణ మరియు కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల వేళ పంటల పరిస్థితిపై జేసీ ఇల‌క్కియ పరిశీలన

– క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి రైతుల‌తో మాట్లాడిన జాయింట్ కలెక్ట‌ర్‌ – పంటలకు నష్టం వాటిల్లకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు ఆదేశాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *