విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళా బిల్లుపై చంద్రబాబు ప్రత్యేకంగా అసెంబ్లీ ఏర్పాటు చేసి చర్చిస్తామని చెప్పడం సరైందికాదని, చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే అన్ని రాజకీయ పక్షాలను ఆహ్వానించి బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరినీ తప్పుదోవ పట్టించడానికి మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయమై అసెంబ్లీ ఏర్పాటు చేస్తానంటున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే పార్లమెంటులో ఆమోదం పొందింది. ఆనాడు ఆమోదం పొందిన బిల్లును అమలుచేయకుండా పెండింగ్‌లో పెట్టి, డీలిమిటేషన్‌తో ముడిపెట్టి నరేంద్రమోడీ, అమితీలు డ్రామా ఆడుతున్నారు. అమితా వ్యాఖ్యలు ప్రతిపక్షాలను రెచ్చగొట్టే విధంగా సాగాయి. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని అందరూ ముక్త కంఠంతో చెబుతున్నారు. అయినప్పటికీ చంద్రబాబుకు మాత్రం మోడీ, అమిత్‌లు ఏమి చెబితే అదే వేదవాక్కుగా కనిపించడం విచారకరం. మహిళా బిల్లు గురించి ఎపీలో అసెంబ్లీలో చర్చపెట్టి విపక్షాలను ఎండగడతామంటున్నారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లులకు ఎపీలో అధికారంలో ఉన్న కూటమి పార్టీలైన టిడిపి, జనసేన, బిజెపిలు మద్దతిచ్చాయి. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీలో మద్దతిచ్చింది. ఇలాంటప్పుడు రాష్ట్ర అసెంబ్లీ ఏర్పాటుచేసి దీనిపై ఏం చర్చిస్తారో అర్ధంకావడం లేదు. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే తెలుగు రాష్ట్రాలతోసహా దక్షిణాది రాష్ట్రాలన్నీ నష్టపోతాయనే విషయాన్ని తెలిసికూడా చంద్రబాబు బుకాయించడం దుర్మార్గం.
దక్షిణాది రాష్ట్రాలలో 50% సీట్లు పెంచుతామని అమిత్ షా నోటి మాటగా మాత్రమే చెప్పడం జరిగిందేగాని, అదే 50% అంశాన్ని బిల్లులో ఎందుకు పొందుపరచలేదని ప్రశ్నిస్తున్నాం. డీలిమిటేషన్ బిల్లులో 2011 జనాభా ప్రాతిపదికన అని పొందుపరచి, మాటల్లో మాత్రం 50% సీట్లు అని చెప్పడం ఎలా నమ్మశక్యం అవుతుంది? కేంద్రంలో అధికారంలో ఉండి, బిల్లులు ప్రవేశపెట్టిన పెట్టిన మోడీ, అమితాలు వ్రాతపూర్వకంగా ఎందుకు చెప్పలేకపోయారు? పార్లమెంటు సాక్షిగా ఎపీకి ప్రత్యేక హోదా ఇస్తామని సాక్షాత్తూ ప్రధాని ఇచ్చిన హామీ మోడీ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు? నీతి అయోగ్ అంగీకరించలేదు కాబట్టి ఆ హామీని అమలు చేయలేదని చెబుతున్నారు. అదే విధంగా డీలిమిటేషన్ కమీషన్ అమిల్షా ఇచ్చిన నోటిమాటను అంగీకరించకపోతే, లేదంటే 2011 జనాభా ప్రాతిపదికనే అని తెలిపారంటూ ఎవరైనా కోర్టుకు వెళితే పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మోడీ, అమిల్షా, బిజెపి వాళ్ల నుండి మెప్పు, మార్కులు పొందేందుకు చంద్రబాబు అసెంబ్లీ పెడతామని చెప్పడం సరైందికాదు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించి, బహిరంగ చర్చకు సిద్ధం కావాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Prajavartha Online Telugu News