Breaking News

తిరుపతి పట్టణంలో పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు

-జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతున్నాయో లేదో నిర్ధారించడానికి తిరుపతి పట్టణంలోని పలు పెట్రోల్ బంకులపై జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్. గోవిందరావు ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా తిరుపతి అర్బన్ పరిధిలోని ఎయిర్ బైపాస్ రోడ్ వద్ద ఉన్న కూరపాటి సర్వీస్ స్టేషన్,తిరుపతి రూరల్ మండలంలోని అవిలాల గ్రామంలో ఉన్న VKRR ఫ్యూయల్ స్టేషన్, తిరుపతి అర్బన్ HPCL ఇంధన స్టేషన్, HPC రిటైల్ అవుట్‌లెట్ పాత అలిపిరి రోడ్ ఎదురుగా. మహతి ఆడిటోరియం ఎదురుగా గల పెట్రోల్ బంకులను సందర్శించి అక్కడి నిర్వహణ, ఇంధన నాణ్యత, కొలతల సరిగ్గా ఉన్నాయా అనే అంశాలను పరిశీలించారు.

జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, తిరుపతి నగరంలో పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పెట్రోల్, డీజిల్ సరఫరా నిరంతరంగా, పారదర్శకంగా జరగాలని సంబంధిత నిర్వాహకులకు ఆదేశించారు. ఇంధన సరఫరాలో నాణ్యత, కొలతలలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వినియోగదారుల హక్కులను కాపాడడం ప్రతి బంక్ యజమాని బాధ్యత అని స్పష్టం చేశారు. అలాగే, పెట్రోల్ బంకులపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వాటిని తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమాలు, మోసపూరిత విధానాలకు తావు లేకుండా క్రమం తప్పకుండా తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారి రాజు రూరల్ తహసిల్దార్ సురేష్ బాబు సంబంధిత అధికారులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *