Breaking News

ఉర్దూ పాఠశాల అదనపు తరగతి గదులు నిర్మాణానికి అసరమైన ప్రతిపాదనలు సిద్దం చెయ్యండి… : ఎమ్మేల్యే డిఎన్ఆర్

కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు, అదనపు తరగతి గదులు నిర్మాణానికి వెంటనే తగు చర్యలు తీసుకుని విద్యార్థులకు సౌకర్యవంతమైన మంచి విద్య అందించడం జరుగుతుందని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం కైకలూరు పట్టణంలోని కొత్తపేట మండలపరిషత్ ప్రాధమికొన్నత పాఠశాల(ఉర్దూ)ను ఎంపిపి అడివికృష్ణ, సర్పంచ్ నవరత్న కుమారిలతో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులను అడిగి పాఠశాలకు కావలసిన మౌలిక సదుపాయాలు, విద్యార్థులను అడిగి వారికి అందిస్తున్న పౌష్టికాహారం వివరాలు ఆరా తీశారు. అనంతరం పాత మండలపరిషత్ పాఠశాల పరిశీలించి శిథిలావస్థకు చేరి, వినియోగంలో లేనందున దానిని తొలగింపజేసి కొత్తగా భవనం నిర్మించుటకు ప్రతిపాదనలు తయారు చేయవలసిందిగా ఆదేశించారు. కేవలం 50 మందికి సరిపోయే గదుల్లో 102 మంది విద్యార్థులు ఉండడం చేత వెంటనే భవన నిర్మాణ ఆవశ్యకతను ఎమ్మెల్యే గుర్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఉర్దూ పాఠశాల పరిస్థితులు గురించి స్థానిక నాయకులు తన దృష్టికి తెచ్చిన వెంటనే ఈ పాఠశాల సందర్శనకు రావడం జరిగిందని, పాఠశాలలో విద్యాబోధన, మధ్యాహ్న భోజనం చక్కగా అమలు జరుగుతున్నాయని అన్నారు. అయితే అదనపు తరగతి గదులు అవసరాన్ని గుర్తించడం జరిగిందని, వెంటనే అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అష్మాబేగం, విద్యా కమిటీ చైర్మన్ కూనవరపు స్వప్న, అబ్దుల్ హమీద్, పంజా రామారావు, భాస్కర వెంకటేశ్వరరావు, చెరుకువాడ బలరామరాజు, గండికోట ఏసుబాబు, కూనవరపు సతీష్, దండే రవిప్రకాష్, విజయ్,మదన్, పాణెం కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *