Breaking News

గన్నవరం అభివృద్ధియే నా లక్ష్యం: విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

-ఆంధ్రప్రదేశ్ భూ క్రమబద్ధీకరణ పథకం-2025 కింద 71 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు, 31 మందికి పోసిషన్ సర్టిఫికెట్లు పంపిణీ
-మంత్రి నారా లోకేష్ చొరవతో జీఓ-30 ద్వారా పేదలకు శాశ్వత హక్కులు
-రిజిస్ట్రేషన్ ఖర్చులను సైతం భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
-గన్నవరం తాగునీటి సమస్య పరిష్కారానికి రూ. 5 కోట్ల కేటాయింపు
-కేసరపల్లిలో త్వరలో హెచ్‌సీఎల్ (HCL) ఏఐ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభిస్తాం

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం నియోజకవర్గంలోని ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చడమే తన లక్ష్యమని ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. మంగళవారం గన్నవరం టీడీపీ కార్యాలయం వద్ద ‘ఆంధ్రప్రదేశ్ భూ క్రమబద్ధీకరణ పథకం-2025’ కింద లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. వెదురుపావులూరు గ్రామానికి చెందిన 19 మంది, వీరపనేనిగూడెం గ్రామానికి చెందిన 52 మంది — మొత్తం 71 మందికి పట్టాలు అందజేశారు. అదనంగా 31 మందికి పొసెషన్ సర్టిఫికెట్లు కూడా పంపిణీ చేశారు. మొదటి విడతలో ఇప్పటికే 200 మందికి పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు శాశ్వత హక్కు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ చొరవతో అమల్లోకి వచ్చిన జీఓ-30 ద్వారా పేదలకు ఆస్తి హక్కు కల్పిస్తూ, రిజిస్ట్రేషన్ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తోందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటికే భారీగా నిధులు కేటాయించినట్లు వెల్లడిస్తూ, గన్నవరం మండలం కు కోనాయి చెరువు పైపులైన్ పనులకు రూ. 5 కోట్లు, రోడ్ల అభివృద్ధికి రూ. 11 కోట్లకు పైగా, పాఠశాలల అభివృద్ధికి రూ. 26 లక్షలు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ. 66 లక్షలు, రూ. 7.18 కోట్లతో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కేసరపల్లిలో హెచ్‌సీఎల్ ద్వారా ఏఐ ట్రైనింగ్ సెంటర్ ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. పేదరికం నుండి బయటపడాలంటే విద్యే ప్రధాన మార్గమని, పిల్లలను బాగా చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. గన్నవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే యార్లగడ్డ స్పష్టం చేశారు.అనంతరం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి షేక్ షాహిద్ బాబు, గన్నవరం ఏయంసి చైర్మన్ గూడవల్లి నరసింహారావు, గన్నవరం మండల తహశీల్దార్ కె వి శివయ్య, మండల ఎంపీడీవో స్వర్ణలత, గన్నవరం మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసిమోహన్, వైస్ ఎంపిపి కొమ్మురాజు సుధీర్, దొంతు చిన్నా, గొడ్డళ్ల రామారావు, కొలుసు రవీంద్ర, బోడపాటి రవి, మేడేపల్లి రమ, గుజ్జర్లపూడి బాబురావు, కాగితాల నాగరాజు, కొండేటి వెంకటేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్, మోదుగుమూడి సత్యనారాయణ, జాస్తి మురళి, కూడారపు వెంకట కృష్ణ, కొసరాజు సాయిరాం, బుస్సే నాగప్రసాద్, తిరువీధి నరేష్, యనమదల సతీష్, అంకెం రామారావు, మణిమాల వెంకట అప్పారావు, చిట్టినేని జోజి, కూరేటి శ్రీనివాస్, చల్లగుల్ల సందీప్, పరుచూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *