విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డొక్కా సీతమ్మ 117వ వర్ధంతి సందర్భంగా ఈరోజు హెచ్ సి జి గుణదల క్యాన్సర్ హాస్పిటల్ లో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న పేషంట్లను పలకరిస్తూ వాళ్ల ఆరోగ్య క్షేమ సమాచారాలను తెలుసుకొని పేషంట్ లందరికీ పండ్లు పంపిణీ చేయడం జరిగింది. డొక్కా సీతమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, టిడిపి సెంట్రల్ మహిళా అధికార ప్రతినిధి అవుటుపల్లి విజయకుమారి మాట్లాడుతూ మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు సహకరించిన ఒకటొక డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్రస్ట్ సభ్యులైన సంసాని విజయలక్ష్మి, గుబ్బల జ్యోతిశ్వరి, యర్రోజు అభిలాష, దాసరి ప్రశాంతి టిడిపి పార్టీ నాయకులకి కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News