Breaking News

దేవాదాయ శాఖ కమిషనర్ చేసిన తప్పు”జీవో నెంబర్. 888″ మార్పులు చేయడాన్ని హై కోర్టు వారు తప్పు బట్టింది… : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాగలం వినిపించింది ప్రజా ప్రయత్నానికి ఫలితం దక్కింది. పోతిన మహేష్ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో దేవాదాయ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలోఈ మధ్యకాలంలో జరిగిన పెద్ద ఎత్తున అవినీతి దొడ్డి దారిలో ఉద్యోగాల నియమకాలు హైకోర్టు ప్రభుత్వం ఇచ్చిన జీవోను తార్ మార్ చేస్తూ. ఇష్టనుసారంగా ఉద్యోగాలు ప్రమోషన్ లు జరిగాయని దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగాయని దేవదాయ శాఖలో వినికిడి జరిగింది ఈ విషయంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన పోతిన మహేష్ పూర్తి ఆధారాలతో హైకోర్టుకు సంబంధించిన జీవో ఆర్డర్ కాపీలతో సహా గతవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 22 వ తేదీన దేవాదాయ శాఖ జీవో నెంబర్ 888 కోర్ట్ కంటెంప్ట్ లో ఉన్నదని జీవో ను ఇష్టానుసారం మారుస్తూ ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ 46 మందికి అక్రమంగా ప్రమోషన్స్ ఇస్తున్నారని అన్ని ఆధారాలతో. జరిగిన అవినీతిపై దేవాదాయ ధర్మాదాయ శాఖకమిషనర్ చేసిన అవినీతి ప్రమోషన్లపై చాలా బలమైన మీడియా సమావేశంలో ప్రజా గొంతుక వినిపించారు. మీడియా సమావేశం జరిగిన వారం రోజులలో పోరాటానికి ఫలితం దక్కిందన మహేష్ అన్నారు. జీవో నెంబర్. 888 మార్పులు చేయడాన్ని హై కోర్టు వారు తప్పు బట్టింది వెంటనే నిలుపుదల చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై పోతిన మహేష్ హైకోర్టు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజల పక్షాన ప్రజలకు న్యాయం జరిగేందుకు ఎక్కడ అవినీతి జరిగిన ప్రభుత్వ జీవోలను తారుమారచేస్తూ కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడుతున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ లాంటి అవినీతిపరులను నిలదీసేందుకు ఎప్పుడూ వైసీపీ పార్టీ తరపున పోరాటానికి ఉంటామని వైసిపి నాయకులు, గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *