అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో 20 లక్షల కు పైగా ఉద్యోగ కల్పన లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మంత్రుల బృందం పిలుపునిచ్చింది. ఏపి సచివాలయంలోని 5వ బ్లాక్ లో ఇన్వేస్ట్మెంట్ అండ్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ పై గురువారం మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది ఈ సందర్భంగా మంత్రులు. కందుల దుర్గేష్,టి.జి.భరత్, గొట్టిపాటి రవి కుమార్, కొండపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఈ సమీక్షలో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 20లక్షలకు పైగా ఉద్యోగ కల్పనపై చేస్తున్న కృషిని ప్రశంసించారు. నూతనంగా ఉద్యోగ కల్పన పొందిన ప్రతి ఒక్కరి వివరాలను ఒక పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు.పోర్టల్ లో నమోదు చేసే ఉద్యోగుల వివరాలు పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు.ఆయా శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.భారీ, మధ్యస్థ, చిన్న పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ ల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన వివరాలు పక్కాగా ఉండాలన్నారు. మంత్రుల బృందం పలు అంశాలపై ఆయా శాఖల ఉన్నతాధికారుతో సమీక్షించింది.
Prajavartha Online Telugu News