Breaking News

ప్రత్యేక ఏజెన్సీ ద్వారా అధ్యయనం!

-ప్రస్తుత మందుల వినియోగ జాబితాలపై పునఃపరిశీలన
-వైద్యులు, ఫార్మసిస్టుల మధ్య సమన్వయం పెరగాలి
-అసుపత్రుల్లో రెగ్యులర్ మందులకు కొరత లేదు
-త్వరలో మరో 380 రకాల మందులు అసుపత్రులకు సరఫరా చేస్తాo
-వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
-సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వాసుపత్రులకు జరిగే మందుల సరఫరా వ్యవస్థలో సమూల మార్పులను తెస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. మందుల కొనుగోళ్లు, అసుపత్రులకు పంపిణీ, రోగులకు అందించే వరకు. వివిధ సాయిల్లో జరుగుతున్న ప్రస్తుత ప్రక్రియను ప్రత్యేక ఏజెన్సీ ద్వారా పునఃస్సమీక్ష చేయిస్తామని స్పష్టంచేశారు. అలాగే ప్రస్తుతం అసుపత్రులకు ఎసెన్షియల్ మెడిసిన్ లిస్ట్ (ఈఎంఎల్), ఆడిషనల్ మెడిసిన్ లిస్ట్ (ఏఎంఎల్) జాబితాలో ఉన్న మందులు, వాటి సరఫరా, మార్కెట్లో కొత్తగా అందుబాటులోనికి వచ్చిన కాంబినేషన్ మందుల వాడకం గురించి కూడా అవసరమైన చర్యలు చేపడతామని వెల్లడించారు. ఈ క్రమంలో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు అవసరంలేని వాటిని తొలగించి, అవసరమైన వాటిని జాబితాలోనికి చేరుస్తామన్నారు. ఫార్మసీ రంగ నిపుణులు, వైద్యులు, సూపరింటెండెంట్లు, ఫార్మసిస్టుల అభిప్రాయాలను కూడా పరిగణనలోనికి తీసుకుంటామన్నారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం సాయంత్రం రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), రాష్ట్ర వైద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) అదధికారులు, పలు బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లు సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఫార్మసీ ఆఫీసర్లతో ప్రభుత్వాసుపత్రుల్లో మందుల లభ్యత, ఇతర అంశాలపై రెండున్నర గంటలపాటు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ వైద్యులు, ఫార్మసిస్టుల మధ్య మందుల లభ్యత, వినియోగంపై ప్రస్తుతం ఉన్న సమన్వయాన్ని మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే జాతీయ ఆరోగ్య కార్యక్రమాల కింద వినియోగించే మందుల సరఫరాలో జాప్యం జరగకుండా ఉండేందుకు ప్రస్తుత విధానం ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాల ద్వారా కాకుండా సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి నేరుగా ఆసుపత్రులకు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. లోకల్ పర్చేజింగ్ విధానంలో ఆసుపత్రులు సూపరింటెండెంట్ల ద్వారా జరిగే మందుల కొనుగోళ్ళ వివరాలను ఈ-ఔషధి పోర్టల్’లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ఈ విధానం అమల్లో లేనందున మందుల కొనుగోళ్ల గురించి, అవి అందుబాటులో ఉన్నాయా? లేవా? లేదా అన్న వివరాలు తెలియటం లేదని తెలిపారు. వైద్యులు రోగులకు రాసే ‘ప్రిసప్షన్లోని మందుల గురించి కూడా ఆడిటింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ (వర్చువల్ ద్వారా) వెల్లడించారు. ఆసుపత్రుల వారీగా ఉన్న మందుల వివరాలను ఇతర ఆసుపత్రుల వారు ‘ఆన్లైన్లో తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తామని, తద్వారా అవసరాలకు తగ్గట్లు మందులను స్థానికంగానే సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం లభిస్తుందని తెలిపారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్లలో కొరతగా ఉండే మందుల వివరాలు: (నాన్ ఆవైలబులిటీ సర్టిపికెటు) ఆన్లైన్లో సూపరింటెండెంట్లు తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తామని కూడా తెలిపారు.

వికేంద్రీకరణ విధానంలో కొనుగోలు

ఏపీ వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అధికారులు మాట్లాడుతూ ఎసిన్షియల్ మెడిసిన్ లిస్టు, అడిషనల్ మెడికల్ లిస్టుల్లో 712కుగాను 176 రకాల మందులను ఆసుపత్రులకు సరఫరా చేయలేకపోతున్నామన్నారు. 176 రకాల మందుల వినియోగం తక్కువగా ఉందని, ఎక్కువ మొత్తంలో అవసరమయ్యే మందులను సరఫరా చేసేందుకు సంస్థలు ముందుకొస్తున్నాయన్నారు. తక్కువ మొత్తంలో అవసరమైన మందులు కావాలంటే మాత్రం సదరు సంస్థలు ముందుకు రావడంలేదని తెలిపారు బెటాక్సాలాల్ (కంటి మందు), ట్యాక్రోలిమస్ (స్కిన్ క్రీమ్) మందుల కొనుగోలుకు టెండర్లు దాఖలైనా తక్కువ మొత్తంలో అనేసరికి, సదరు సంస్థలు ముందుకు రాలేదన్నారు. మిథైయిల్ ప్రడ్నిసిలోన్ (స్టెరాయిడ్) ఇంజెక్షన్ సరఫరాకు అసలు టెండరు కూడా రాలేదన్నారు. ఈ పరిస్థితుల్లో ఆసుపత్రుల వారు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం వికేంద్రీకరణ విధానంలో స్థానికంగా కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. మందుల నిల్వలకు తగ్గట్లు చర్యలు 177 రకాల మందుల నిల్వలు మూడు నెలలకు సరిపడా ఉన్నాయని, 84 రకాలు 2-3 నెలల వరకు, 80 రకాల మందులు ఒకటి నుంచి రెండునెలల వరకు అందుబాటులో ఉంటాయన్నారు. మరో 178 రకాల మందుల నిల్వలు నెల వరకు సరిపోయేలా ఉన్నాయన్నారు. 17 రకాల మందులు అందుబాటులో లేవన్నారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో ఉన్న నిల్వలకు తగ్గట్లు 380 రకాల మందులను రూ.71.12 కోట్లతో కొనుగోలు చేసామని, ఆర్డర్ల ప్రకారం త్వరలోనే సదరు ఆసుపత్రులకు సరఫరా అవుతాయన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు, విశాఖ, గుంటూరు బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లు వాణీ, రమణ యశస్వి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *