Breaking News

‘పేదల సేవలో’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పామర్రు నియోజకవర్గం, పమిడిముక్కలలో పర్యటించారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. తలసీమియాతో బాధపడుతోన్న చాగంటిపాటి వివేక్ అనే 13 ఏళ్ల బాలుడుకి రూ.10 వేల పింఛను సొమ్మును అందించారు. అతని ఆరోగ్య పరిస్థితులను గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. తలసీమియా వ్యాధి కారణంగా నెలకు మూడు నాలుగు సార్లు రక్త మార్పిడి చేయాల్సి వస్తోందని, ఇందుకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకూ ఖర్చవుతోందని వివేక్ కుటుంబ సభ్యులు సీఎంకు దృష్టికి తీసుకొచ్చారు. చదువులోనూ వివేక్ చురుగ్గా ఉంటారని, వ్యాధి నుంచి బయటపడేందుకు సాయం అందించాలని సీఎంను కోరారు. వారి విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *