Breaking News

సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంప్ కు ఆదరణ..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గంలోని భీమనవారిపేట లో నిర్వహించిన సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంపుకు అపూర్వ స్పందన వచ్చింది… 46, 47 డివిజన్ల ప్రజల కోసం సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ వ్యాన్ల ద్వారా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు.., శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన మెడికల్ క్యాంపు లో స్తానిక ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు.. క్యాంప్ ద్వారా పలు ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స సహాయం తో పాటు మందులు కూడా ఉచితంగా అంద చేశారు. ఈ క్యాంపులో వివిధ విభాగాల సీనియర్ వైద్యుల కన్సల్టేషన్ తో పాటు ఈసీజీ, ఎక్స్ రే, 2డీ ఎకో , తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించారు.. శంకర్ నేత్ర చికిత్సాలయ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ వారి మెడికల్ టీమ్ క్యాంప్ కు సహకరించారు… సిద్ధార్థ దంత వైద్య కళాశాల వైద్యులు దంత వ్యాధుల కి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో సుజనా ఫౌండేషన్ ప్రతినిధులు కిరణ్, వెంకట రమణ, హరీష్ ,ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, 46వ డివిజన్ టిడిపి ప్రెసిడెంట్ గుర్రంకొండ, పోతినేని లోకేష్, 47 వ డివిజన్ టిడిపి ప్రెసిడెంట్ నాగోతి రామారావు , జనసేన సిటీ సెక్రెటరీ ఆఖరపు విజయ్ కుమారి , సుజనా మిత్ర లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *