అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో శనివారం ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 45.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మొత్తం 28 జిల్లాలకు గాను 17 జిల్లాల పరిధిలోని 239 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపి 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు వెల్లడించారు. కడప జిల్లా 34 మండలాలు, నెల్లూరు 32, తిరుపతి 29, పల్నాడు 26, ప్రకాశం 25, మార్కాపురం 21, నంద్యాల20 , కర్నూలు17, చిత్తూరు జిల్లా 10 మండలాల్లో ఎక్కువగా ప్రభావం చూపిందన్నారు.
ఆదివారం (03-05-26) ఎండ తీవ్రతతో పాటుగా గుంటూరు జిల్లా మేడికొండూరు, పెదనందిపాడు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, తుళ్లూరు, వట్టిచెరుకూరు మండలాల్లో (06) తీవ్రవడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
విజయనగరం 10, మన్యం 12, అల్లూరి1, పోలవరం 5, తూర్పుగోదావరి 3, ఏలూరు 2, కృష్ణా 7, ఎన్టీఆర్ 14, గుంటూరు 12, బాపట్ల 9, పల్నాడు 22, మార్కాపురం 3, ప్రకాశం 15, నెల్లూరు 4, తిరుపతి 5 మొత్తంగా 124 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
శనివారం ప్రకాశం(జి) కొప్పెరపాడులో 45.4°C,
మార్కాపురం(జి) బొట్లగూడూరులో 45.1°C, తిరుపతి(జి) వెంకటగిరిలో 45°C, నెల్లూరు(జి) కలిగిరిలో 44.4°C, పల్నాడు(జి) నూజెండ్లలో 44.3°C,
చిత్తూరు(జి) తవణంపల్లె,
నంద్యాల(జి) దొర్నిపాడులో 44.1°C,
వైఎస్సార్ కడప(జి) కలసపాడులో 43.9°C,
బాపట్ల(జి) కారంచేడులో 43.7°C, కర్నూలు(జి) మంత్రాలయంలో 43.2°C, అనంతపురం(జి) తెరన్నపల్లిలో 42.8°C, ఎన్టీఆర్(జి) విజయవాడ తూర్పులో 42.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.
మరోవైపు రాజస్థాన్ పై గల ఉపరితల ఆవర్తనం నుండి విదర్భ,తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరియన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఎపిఎస్డీఎంఎ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం (03-05-26) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.
Prajavartha Online Telugu News