Breaking News

“నాడు సమస్యలు – నేడు పరిష్కారాలుయువ నాయకుడు బొండా సిద్ధార్థ పర్యటన

-నిర్లక్ష్యానికి ముగింపు – అభివృద్ధికి నాంది, గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం ఎదుర్కొన్న కాలనీకి కొత్త రూపు ₹50 లక్షలతో మౌలిక సదుపాయాల కల్పన రోడ్లు, డ్రైనేజీ, లైటింగ్, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు
-ప్రజల అభిప్రాయం – అభివృద్ధికి ప్రశంసలు ప్రజల కోసం నిరంతరం సేవలో బొండా కుటుంబం అందుకే “బొండా ఉమ కాలనీ”గా నామకరణం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్‌లో ఆదివారం గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోక, కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పూనూరు సుబ్బరామిరెడ్డి నగర్ ప్రాంతాన్ని NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే సమగ్రంగా అభివృద్ధి చేసిన విషయం విశేషం.

గతంలో ఎన్నో సంవత్సరాలుగా నరకయాతన అనుభవించిన ఈ కాలనీ ప్రజలు, సెంట్రల్ నియోజకవర్గాన్ని 2015 నుండి 2019 వరకు అభివృద్ధి చేసిన శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ని అత్యధిక మెజారిటీతో గెలిపించిన తరువాత, తమ సమస్యలను తెలియజేయగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు, స్థానిక కార్పొరేటర్ వీరమాచినేని లలితా కిషోర్ తో సమన్వయం చేసుకొని రూ.50 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్లు, సందులలో మార్బుల్ టైల్స్, వీధి దీపాలు, తాగునీటి సరఫరా మరియు సమగ్ర డ్రైనేజీ వ్యవస్థలను ఏర్పాటు చేయించారు.

అంతేకాకుండా, 2025 డిసెంబర్ నాటికి అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన నివాస వసతులను కల్పించి కాలనీ ప్రజలకు అందజేయడం జరిగింది. దీంతో ఆ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయి.

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ “నాడు సమస్యలు – నేడు పరిష్కారాలు” కార్యక్రమం ద్వారా డివిజన్‌లో పర్యటించి, అక్కడ జరిగిన అభివృద్ధి పనులను స్వయంగా ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు, ప్రజల అవసరాలను, సమస్యలను కూడా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కాలనీ ప్రజలు మాట్లాడుతూ—గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదని, కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేదల సమస్యలను తమవిగా భావించి పరిష్కరించారని తెలిపారు. ఆయన కృషి వల్లే నేడు తమ కాలనీ అభివృద్ధి చెంది సుఖశాంతులతో జీవిస్తున్నామని అన్నారు.

ఈ కృతజ్ఞత భావంతో కాలనీవాసులంతా కలిసి తమ ప్రాంతానికి “బొండా ఉమ కాలనీ” అని నామకరణం చేసి, స్వయంగా ప్రారంభించడం జరిగింది. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం నిరంతరం పనిచేసే కుటుంబంగా బొండా కుటుంబం నిలిచిందని, అదే ధోరణిలో బొండా సిద్ధార్థ గారు కూడా ప్రతి డివిజన్‌లో పర్యటిస్తూ అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారిస్తున్నారని ప్రజలు అభినందించారు. భవిష్యత్తులో బొండా ఉమామహేశ్వరరావు, బొండా సిద్ధార్థ మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *