Breaking News

భూ సమస్యలపై త్వరలోనే పూర్తి పరిష్కారం

-CRDA లో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశం
-విలేకరులతో మాట్లాడిన పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని రైతుల భూ సంబంధిత అంశాలపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రాయనపూడిలోని సిఆర్డిఏ కార్యాలయంలో మంగళవారం సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..

పెమ్మసాని మాట్లాడుతూ
* CRDA కు కొత్త కమిషనర్ గా విజయ రామరాజు గారు ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు.
* నూతన కమిషన్ కి రాజధాని సంబంధిత పలు అంశాలపై అవగాహన కల్పించడంలో భాగంగా సమీక్ష నిర్వహించుకున్నాము.
* పెండింగ్లో ఉన్న కొన్ని గ్రామ కంఠాల సమస్యలు, కొన్ని FSI, గ్రామాల్లోని మౌలిక వసతులు, తదితరాంశాలపై అధికారులు గ్రౌండ్ లెవెల్ కు స్వయంగా వెళ్లి పరిశీలిస్తే స్థానిక సమస్యలు తెలుస్తాయి అని ఈరోజు మాట్లాడాము.

మంత్రి నారాయణ కామెంట్స్
* గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, స్మశానాల ఏర్పాటు తదితర సౌకర్యాలు కల్పించే విధంగా కొత్త కమిషన్ తో కలిసి అందరం చర్చించాము.
* రాజధాని పరిధిలోని 29 గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేయాలని, తద్వారా స్థానిక సమస్యలు అర్థం అవుతాయని కమిషనర్ గారికి త్రిసభ్య కమిటీ తెలియజేసింది.
* ఏదైతే పాలసీని ఏర్పాటు చేశామో, దాని ప్రకారమే సమస్యలకు పరిష్కరిస్తాము తప్ప, వ్యక్తిగతంగా ఎవరికి ఎలాంటి ప్రయోజనం చేయకూడదు.

ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కామెంట్స్
* పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాల కారణంగా త్రీ మెన్ కమిటీ సమావేశం జరిగి రెండు నెలలు గడిచింది.
* రోడ్ల నిర్మాణాల వల్ల ఇళ్ళు కోల్పోతున్న వారికి NSP పాలసీ ద్వారా enhanse చేయాలని చర్చించాము.
* ఆ రోజు వరకు సంబంధించిన కమిటీ గ్రామ కంఠాలకు సంబంధించి, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిష్కరించాలని చెప్పింది చర్చించాము.
* స్మశానాలు, మంజూరైన మరికొన్ని మౌలిక వసతులను త్వరితగతిన పూర్తి చేయాలని మాట్లాడాము.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *