Breaking News

మహిళా పారిశ్రామికవేత్తలకు మార్కెటింగ్ భరోసా కల్పించాలి..

-రతన్ టాటా హబ్ (ఆర్‌టిహెచ్) ద్వారా శిక్షణ అందిస్తాం..
-ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం సద్వినియోగం చేసుకోవాలి..
-ఒక కుటుంబం- ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంలో భాగస్వాములుకండి..
-జిఎస్‌టి, ఎఫ్ఎస్‌టి రిజిస్ట్రేషన్ తప్పక పాటించాలి..
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పొదుపు సంఘాల మహిళలకు పారిశ్రామిక రంగంపై అవగాహన కల్పించి తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేసిన రతన్ టాటా హబ్ (ఆర్‌టిహెచ్) పట్టణ స్వయం సహాయక సంఘం ( మెప్మా) మహిళలు సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా స్వయం ఉపాధి రంగంలో మరింత ముందుకు సాగేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.

మెప్మా పొదుపు సంఘాల మహిళలు ఆర్థిక ప్రయోజనం చేకూర్చేందుకు శనివారం కలెక్టరేట్‌లోని ఎవిఎస్ రెడ్డి సమావేశ మందిరంలో మెప్మా అధికారులు టౌన్ లెవల్ ఫెడరేషన్ ఏరియా లెవల్ ఫెడరేషన్ సభ్యులతో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరులలో 14 పట్టణ స్థాయి సమాఖ్యలు పనిచేస్తున్నాయన్నారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల నైపుణ్యాభివృద్ధి కోసం రతన్ టాటా హబ్ (ఆర్‌టిహెచ్) ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఉత్పత్తుల తయారీ, నాణ్యత ప్రమాణాలు, బ్రాండింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ తదితర అంశాలపై మహిళలకు అవగాహన కల్పించి వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలనదే లక్ష్యమన్నారు. ప్రభుత్వం పొదుపు సంఘాలలోని మహిళలకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్ప్పున గ్రూపు మొత్తానికి 20 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు. మంజూరైన బుణాలను సభ్యులు వ్యతిగత మరియు ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారని ఇది ఎంత మాత్రము సమంజసం కాదన్నారు. తీసుకున్న రుణ సదుపాయాలు, సబ్సిడీలను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి యూనిట్లను విజయవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఇందుకు రతన్ టాటా హబ్ ద్వారా శిక్షణ అందించి “ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త” లక్ష్యంలో మహిళలను భాగస్వాములుగా చేయాలని మెప్మా సమాఖ్య సభ్యులకు సూచించారు. ఎన్‌టీఆర్ జిల్లాలో ఏడాదికి వెయ్యి కోట్లకుపైగా జీవనోపాధి రుణాలు మహిళలకు అందుతున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకుంటూ స్వయం సమృద్ధితో సగర్వంగా నిలబడేలా చేయడంలో మహిళలకు చేయూతనివ్వాలని కోరారు. వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే ప్రతి యూనిట్ తప్పనిసరిగా జీఎస్‌టీ, ఏఫ్ఎస్‌టి తదితర సంబంధిత రిజిస్ట్రేషన్లు పొందాలని, చట్టబద్ధమైన విధానాలను పాటించడం ద్వారా వ్యాపార విస్తరణకు అవి మరింత దోహదపడతాయని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు.

సమావేశంలో వీఎంసి యుసిడి ప్రాజెక్టు ఆఫీసర్ చంద్రశేఖర్, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ పి. మురళి కృష్ణప్రసాద్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు మీనాక్షి కార్యదర్శి నజీమున్సీసా, జిల్లాలోని పట్టణ సమాఖ్యల అధ్యక్షులు మెప్మా సిబ్బంది ఎస్. సుధరాణి, ఎవిఎన్ సుగుణ, కె. కవిత, శ్రీ దుర్గా, శ్రీధర్ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *