Breaking News

కొండప్రాంత అభివృద్ధికి ప్రత్యేక చర్యలు… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని కొండప్రాంత అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అధిక నిధులు మంజూరు చేపించి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మంగళవారం స్థానిక 6 వ డివిజన్ లో పర్యటించి స్థానికుల నుండి సమస్యలు మరియు జరుగుతున్న అభివృద్ధి పనులు గురించి అభిప్రాయలను తెలుసుకొన్న విజయవాడ తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ మరియు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ. ఈ ప్రాంత అభివృద్ధి కి ప్రత్యేక దృష్టి పెట్టి నూతన మెట్ల మార్గాలు,రైలింగ్,మంచినీటి పైప్ లైన్ ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఏ నమ్మకం తో అయితే దాదాపు 1300 ఓట్ల మెజారిటీ తో వైస్సార్సీపీ కార్పొరేటర్ అమర్నాధ్ ను గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకునే విధంగా నిత్యం మీకు అందుబాటులో ఉంటూ, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఉద్ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో టీడీపీ అధికారంలో వున్నప్పుడు కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ ఆ పార్టీ వారే ఉన్న కూడా ఈ డివిజన్ అభివృద్ధి గురుంచి పట్టించుకోలేదని,కొండ ప్రాంతం అధికంగా ఉన్న ఈ డివిజన్ లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కోట్ల రూపాయలు వెచ్చించి నూతన మెట్ల మార్గాలు, మంచి నీటి పైప్ లైన్,సైడ్ డ్రైనేజీ నిర్మాణలు చేపట్టడం జరిగిందని అన్నారు. కొండ మీద చివరి ఇంటి వరకు కూడా మంచినీరు అందించేలా చర్యలు చేపట్టినట్టు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం,అభివృద్ధి రెండు కళ్లుగా పరిపాలన చేస్తుంటే ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తూ వారి రాజకీయ పబ్బం గడుపుకోడానికి దిగజారి రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు దగ్గర కు వచ్చి ఎమ్మెల్యే ఫోటోలు దిగి,ఆయనే ఆ పని చేసినట్లు ఫోజులు ఇస్తున్నారు అని ఎద్దేవా చేశారు. మీరు ఎన్ని డ్రామాలు ఆడిన,ఎంత షో చేసిన ప్రజలకు వాస్తవాలు తెలుసని రాబోయే రోజుల్లో వారే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విఎంసి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్, రాష్ట్ర తూర్పు కాపు డైరెక్టర్ శ్రీ ఇజ్జడా తేజ, వైసీపీ నాయుకులు సంపత్, అబ్బినాయుడు, ప్రభు దాసు, క్లైవ్, ముక్కు వెంకటేశ్వరరెడ్డి మరియు డివిజన్ నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *