విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు గాంధీనగర్‌లోని కందుకూరు కళ్యాణమండపంలో మంగళవారం “నమస్తే డే” సందర్భంగా వేస్ట్ పికర్స్ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారికీ అవసరమైన ప్రత్యేక సంక్షేమ కిట్లను అందజేశారు. అనంతరం వైద్య బృందం ద్వారా కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు తదితర ప్రాథమిక పరీక్షలు చేశారు. అవసరమైన వారికి వైద్యుల సూచనలు, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. వారి ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సూపరింటెండెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ వేస్ట్ పికర్స్ ఆరోగ్యం, భద్రత, సంక్షేమానికి విజయవాడ నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్ తో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ గోపాల్ నాయక్, డాక్టర్ అన్నపూర్ణ, దళిత్ బహుజన రిసోర్ సెంటర్ పులి రామదేవి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, బి. రమేష్, యం. ప్రవళిక సిటీ కోఆర్డినేటర్, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News