Breaking News

ముసారాంబాగ్ మూసీపై వారధి..

-తెలంగాణ అభివృద్ధికి సారథి..
-మన రేవంతన్న..!
-జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే..

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
అంబర్‌పేట్ నియోజకవర్గ ప్రజల ఎన్నో ఏళ్ల కలను సాకారం చేస్తూ ముసారాంబాగ్ మూసీ నదిపై నిర్మించిన నూతన హై లెవల్‌ బ్రిడ్జ్ ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తో పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ పాల్గొన్నారు..

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముసారాంబాగ్ మూసీ నదిపై నిర్మించిన నూతన హై లెవల్‌ బ్రిడ్జ్ ను ప్రారంభించారు.. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు హైదరాబాద్ నగర అభివృద్ధికి పెద్దపీట వేయడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు..

ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయకుణ్ణి పూజిద్దాం… పర్యావరణాన్ని పరిరక్షించుకుందాము

-వినాయక చవితి శుభాకాంక్షలు -పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విఘ్నాలను తొలగించి, శుభాలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *