Breaking News

సంక్షేమ పాలనలో రాష్ట్రం దేశానికే ఆదర్శం : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ పాలనలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన నేత ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. నూజివీడు పట్టణం 1వ వార్డు యం.ఆర్.అప్పారావు కాలనీలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతీ పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. ఇల్లు లేని ప్రతీ పేదవాడికి ఇంటి స్థలం ఉచితంగా అందించడమే కాక స్వంత ఇంటిని నిర్మించి ఇస్తున్నామన్నారు. జగనన్న కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అందించి అభివృద్ధి చేసి ఇస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రూ. 40 లక్షలు 15వ ఆర్ధిక సంఘం నిధులతో సిసి రోడ్లు పనులకు, కాలనీలో 20.50 లక్షలు 15వ ఆర్ధిక సంఘం నిధులతో వైపులైనుకు ఎమ్మెల్యే శంఖుస్ధాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామిశెట్టి త్రివేణిదుర్గ మున్సిపల్ కమీషనరు సయ్యద్ అబ్దుల్ రషీద్, మున్సిపల్ డి.ఇ. లక్ష్మీనారాయణ, ఏఇ ఏసుపాదం, కాన్సిలర్ శీలం రాము, షేక్ రజియా బేగం కాలనీ వాసులు, అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *