Breaking News

నూజివీడు ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తాను: జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
నూజివీడు ప్రాంతం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పల హారిక చెప్పారు. స్ధానిక మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఛాంబర్ ను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, శాసన సభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న జిల్లాపరిషత్ చైర్మన్ పర్సన్ హారిక మాట్లాడుతూ నూజివీడు ప్రాంతంలో సాగు, త్రాగు నీరు, రోడ్లు వంటి అన్ని మౌలిక సదుపాయాలకల్పనకు తాను పూర్తి స్థాయిలో అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పాలనను సాగిస్తున్నారన్నారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ఎన్నో విన్నూత్నమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ తిరుగులేని ప్రజాభిమానాన్ని సంపాదిస్తున్నారన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలుతో పాటు, వాటిని అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందేలా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. మన రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, సచివాలయ వ్యవస్థ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయన్నారు. శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ దివంగత నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి త్రిబుల్ ఐటీ , కృష్ణా జలాలు అందించి నూజివీడు ప్రాంతం అభివృద్ధికి ఎంతగానో కృషి చేసారని, ఆయన తనయుడు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలో పయనించి నూజివీడుకు హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. .
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పల హరికను దుశ్శాలువాతో శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సత్కరించారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్లు గుడిమళ్ల కృష్ణంరాజు, గరికిపాటి శ్రీదేవి, ఎంపిపిలు ఆరెపల్లి శిరీష, గోళ్ల అనూష యం.పి.డి.వో జి. రాణి, నియోజకవర్గంలోని యంపిపిలు, వైస్. యంపిపిలు, పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, ప్రభృతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *