-జాయింట్ కలెక్టర్(హౌసింగ్) శ్రీవాస్ నూపూర్ అజయకుమార్
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 21 వ తేదీన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం(ఓటీఎస్) కింద లబ్దిదారులకు పట్టాలు పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమం గుడివాడలో నిర్వహించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్(హౌసింగ్) శ్రీవాస్ నూపూర్ అజయకుమార్ అన్నారు.
శనివారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జగనన్న సంపూర్ణ గృహహక్కు పధకం (ఓటీఎస్)లో పురోగతి పై రెవిన్యూ, హౌసింగ్ అధికారులతో జాయింట్ కలెక్టర్(హౌసింగ్) శ్రీవాస్ నూపూర్ అజయకుమార్ సమీక్షించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టరు మాట్లాడుతూ ఈ నెల 21 వ తేదీన జగనన్న శాశ్వత గృహహక్కు పథకం(ఓటీఎస్) కింద లబ్దిదారులకు పట్టాలు పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమం గుడివాడ ముదినేపల్లి రోడ్డులో గల అలంకృత కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుందని అందుకు సంబందించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఒటిఎస్ పధకం పటిష్టవంతంగా అమలు చేయాలని,పధకం ప్రయోజనాలు లబ్దిదారులకు వివరించి సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఈ నెల 21 న అన్ని నియోజక వర్గ స్థాయిల్లో పట్టాల పంపిణీ కార్యక్రమం జరగుతుందన్నారు. జిల్లా స్థాయి కార్యక్రమం గుడివాడలో నిర్వహిస్తారన్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పధకం (ఓటీఎస్) జిల్లా వ్యాప్తంగా 714,543 లబ్దిదారులు రూ. 15 కోట్ల,76లక్షల 78 వేలు చెల్లించి ఓటీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారన్నారు. బందరు డివిజన్ లో 20865 మంది, గుడివాడ డివిజన్ లో 13668 మంది, నూజివీడు డివిజన్ లో 14514మంది, విజయవాడ డివిజన్ లో 22496 మంది లబ్దిదారులు ఇప్పటి వరకు జగనన్న సంపూర్ణ గృహహక్కు పధకం (ఓటీఎస్) సద్వినియోగం చేసుకున్నారని జాయింట్ కలెక్టరు తెలిపారు. సమావేశంలో ఆర్డీవో శ్రీనుకుమార్, గృహనిర్మాణ సంస్థ పీడీ రామచంద్రన్, ఈఈ శ్రీదేవి, డీఈ రామోజీనాయక్, ఏఈ సుబ్బారావు, తాహశీల్థార్లు శ్రీనుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News